Airtel Prepaid Recharge : ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను పెంచుతూ ప్రకటన

టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ లో మార్పులు చేసింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ లో ఉన్న రూ.49 ప్లాన్ ను నిలిపివేసింది. దీని స్థానంలో రూ.79 ప్లాన్ ను తీసుకొచ్చింది. ప్లాన్ ధరను ఒకేసారి 60 శాతం పెంచింది ఎయిర్ టెల్. ఇక ధరల పెరుగుదలపై ఎయిర్ టెల్ ప్రతినిధులు మాట్లాడుతూ వినియోగదారుడికి మెరుగైన సేవలు అందించేందుకు ప్లాన్స్ లో మార్పులు చేశామని తెలిపారు.

Airtel Prepaid Recharge : ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను పెంచుతూ ప్రకటన

Airtel Prepaid Recharge

Updated On : July 29, 2021 / 11:22 AM IST

Airtel Prepaid Recharge : టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ లో మార్పులు చేసింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ లో ఉన్న రూ.49 ప్లాన్ ను నిలిపివేసింది. దీని స్థానంలో రూ.79 ప్లాన్ ను తీసుకొచ్చింది. ప్లాన్ ధరను ఒకేసారి 60 శాతం పెంచింది ఎయిర్ టెల్. ఇక ధరల పెరుగుదలపై ఎయిర్ టెల్ ప్రతినిధులు మాట్లాడుతూ వినియోగదారుడికి మెరుగైన సేవలు అందించేందుకు ప్లాన్స్ లో మార్పులు చేశామని తెలిపారు.

రూ.79 స్మార్ట్ రీఛార్జితో డబుల్ డేటా, నాలుగు రేట్లు ఎక్కువ అవుట్ గోయింగ్ కాల్స్ మాట్లాడవచ్చని తెలిపారు. రూ.79తో రీఛార్జి చేసుకుంటే 200 MB డేటా, రూ.64 టాక్ టైం రానుంది. ఒక సెకనుకు 1 పైసా ఛార్జ్ పడనుంది. ఈ ప్లాన్ కు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ లో ఫ్రీ ఎస్ఎంఎస్ లకు కోత విధించారు.

ఇక కొన్ని రాష్ట్రాల్లో రూ.49 ప్లాన్ అందుబాటులో ఉంది. వ్యాలిడిటీ తగ్గించి ప్లాన్ ని కొనసాగిస్తున్నారు. రూ.49 రీఛార్జీతో గతంలో 28 రోజుల వ్యాలిడిటీ వచ్చేది. కానీ ఇప్పుడు 14 రోజులకు కుదించారు. 28 రోజుల వ్యాలిడిటీ రావాలంటే ఖశ్చితంగా రూ.79 స్మార్ట్ రీఛార్జీ చేసుకోవాల్సిందే.

ఇక ఐడియా, వొడాఫోన్ కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. తమ ప్రీపెయిడ్ స్మార్ట్ రీచార్జీ చార్జీలు పెరిగాయి. ఛార్జీల పెంపుతో ఎయిర్ టెల్ షేర్ వ్యాల్యూ బుధవారం 5 శాతం పెరిగింది. ఐడియా-వొడాఫోన్ షేర్ మాత్రం 0.48 % క్షిణించింది.