అజిత్ పవార్ పై వేటు

  • Published By: chvmurthy ,Published On : November 23, 2019 / 07:40 AM IST
అజిత్ పవార్ పై వేటు

Updated On : November 23, 2019 / 7:40 AM IST

మహారాష్ట్ర  రాజకీయాల్లో  రాత్రికి రాత్రే  పరిస్ధితులు మారిపోయినాయి. ఎవరూ ఊహించని విధంగా పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీతో చేతులు కలిపి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అజిత్ పవార్ ని ఎన్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దేవేంద్రఫడ్నవీస్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా, అజిత్  పవార్ డిప్యూటీసీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.  దీంతో అజిత్ పవార్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.. అలాగే  శాసనసభా పక్ష నేతగా కూడా తొలగించారు.

అజిత్‌ పవార్‌ ఎన్సీపీని మోసం చేసి నమ్మకద్రోహిగా మిగిలిపోయారని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అజిత్ నిర్ణయం పార్టీతోపాటు కుటుంబంలోనూ చీలిక తెచ్చిందన్నారు. శివసేన, కాంగ్రెస్ తో కలిసి ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని  శరద్ పవార్ ప్రకటించిన కొద్ది సేపటికే  ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవటంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 

కాగా.. ఫడ్నవీస్ ప్రభుత్వం బల నిరూపణకు నవంబర్ 30వ తేదీ గడువు విధించారు గవర్నర్ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ.నవంబర్ 30 లోపు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించారు.మొత్తం 288 అసెంబ్లీ   స్థానాలు  ఉన్న మహారాష్ట్ర శాసన సభవలో  ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. అక్టోబ‌ర్ 21వ తేదీన జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ-శివ‌సేన పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి.

మహా రాష్ట్రలో పార్టీల బలాబలాలు
బీజేపీ – 105
శివసేన – 56
ఎన్సీపీ – 54
కాంగ్రెస్ – 44
బహుజన్ వికాస్ అగడి – 3
ఎంఐఎం – 2
ప్రహార్ జనశక్తి పార్టీ – 2
సమాజ్‌వాదీ పార్టీ – 2
ఇతరులు – 13