UP Election 2022 : నా హెలికాప్టర్‌‌ను ఎందుకు అనుమతించలేదు.. కుట్ర దాగి ఉంది

బీజేపీకి చెందిన ఓ నాయకుడికి అదే విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వెళ్లడానికి అనుమతించారని తెలిపారు. బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఎంత చేసినా...

UP Election 2022 : నా హెలికాప్టర్‌‌ను ఎందుకు అనుమతించలేదు.. కుట్ర దాగి ఉంది

Up Sp Akhilesh

Akhilesh Yadav Helicopter Stopped : ఎన్నికలు వస్తున్నాయంటే.. చాలు దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. ప్రత్యర్థులపై విరుచుకపడుతుంటారు. తాజాగా.. హెలికాప్టర్ అనుమతించకపోవడంపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ ఒంటికాలిపై లేచారు. బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఓటమి కుట్రగా ఆయన అభివర్ణించారు. ఢిల్లీ నుంచి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ కు హెలికాప్టర్ లో వెళ్లేందుకు అఖిలేష్ యాదవ్ సిద్ధమయ్యారు. కానీ తన హెలికాప్టర్ టేకాఫ్ కు అనుమతించలేదని ఆరోపించారు.

Read More : Sajjala : కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి జీతాలు-సజ్జల

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. బీజేపీకి చెందిన ఓ నాయకుడికి అదే విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వెళ్లడానికి అనుమతించారని తెలిపారు. బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఎంత చేసినా.. 2022 లో జరిగే ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారాయన. ఆయన చేసిన ఆరోపణలపై బీజేపీ రియాక్ట్ అయ్యింది. జర్నలిస్టులతో పోరాడడం, గూండాలకు, ఖైదీలకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం..ఇప్పుడు హెలికాప్టర్ ఘటన కుట్ర అని ఆరోపించడం ఎస్పీ పార్టీ ఒటమికి సంకేతాలని బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా విమర్శలు చేశారు. ముజఫర్ నగర్ లో ఆర్ఎల్డీ (RLD) అధినేత జయంత్ చౌదరీతో అఖిలేష్ యాదవ్ సమావేశం కానున్నారని తెలుస్తోంది.

Read More : Virata Parvam: తండ్రీ కొడుకుల రిలీజ్ వార్.. ఫైనల్ గా ఓటీటీలోనే?!

ఇటీవలే రద్దు చేయబడిన మూడు వ్యవసాయ చట్టాల ఆందోళనలు యూపీ ఎన్నికలపై ప్రభావితం చేస్తాయని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా.. ఇటీవలే రాష్ట్రంలో పర్యటించిన హోం మంత్రి అమిత్ షా జాట్ నేతలను కలుసుకున్న సంగతి తెలిసిందే. జాట్ నేతలను ప్రసన్నం చేసుకొనేందకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తునట్లు సమాచారం. ఆర్ఎల్డీ చీఫ్ కోసం బీజేపీ ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉన్నాయని బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ తెలిపారు. దీనిపై జయంత్ చౌదరి కూడా స్పందించారు. తీవ్ర ఇబ్బందులు పడిన 700 రైతు కుటుంబాలను ఆహ్వానించండి..తనను కాదు అంటూ జయంత్ ట్వీట్ చేశారు.

Read More : Bharat Biotech : భారత్ బయోటెక్‌ బూస్టర్ డోస్ ట్రయల్స్‌కు DCGI అనుమతి.. ముక్కు ద్వారా వేసే టీకా..!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగనున్నాయి. కానీ..అందరి చూపు మాత్రం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వైపు ఉంది. ఇక్కడ మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ, పాగా వేయాలనే దిశగా సమాజ్ వాదీ పార్టీలు పోటీపోటీగా వ్యూహాలు పన్నుతున్నాయి. బీజేపీ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు ఎస్పీ వైపు వెళ్లిపో్యారు. ఈ క్రమంలో.. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. దొరికిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో ముగియనుంది.

Read More : Somu Veerraju : కడప ఎయిర్‌పోర్టుపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు-సోము వీర్రాజు

మొత్తం స్థానాలు 404
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలు 202
అధికారంలో బీజేపీ
బీజేపీకి 303 స్థానాలు

Read More : Shooting Postpones: ఆగిన సినిమాలు.. సెట్స్ మీదకెప్పుడు? షూటింగ్ ఎప్పుడు?

ఎస్పీకి 49 స్థానాలు
బీఎస్పీకి 15 స్థానాలు
కాంగ్రెస్‌కు 7 స్థానాలు
ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ
మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తున్న ఎస్పీ