Sajjala : కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి జీతాలు-సజ్జల

ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లకు, ఉద్యోగ సంఘం నేతలు చేస్తున్న డిమాండ్లకు ఏ మాత్రం సంబంధం లేదంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

Sajjala : కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి జీతాలు-సజ్జల

Sajjala Prc

Sajjala : ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లకు, ఉద్యోగ సంఘం నేతలు చేస్తున్న డిమాండ్లకు ఏ మాత్రం సంబంధం లేదంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించడం లేదన్నారాయన. హెచ్ఆర్ఎస్ స్లాబులతో నష్టం జరుగుతుందని అనుకుంటే దానిపై చర్చించేందుకు మంత్రుల కమిటీ సిద్ధం అన్నారు. పీఆర్సీ వ్యవహారం, ఉద్యోగుల ఆందోళనలపై సజ్జల చిట్ చాట్ చేశారు.

Alien Planets: “5,000 గ్రహాల్లో ఏలియన్స్”?.. అమెరికా అంతరిక్ష పరిశోధకుల వింత వాదన

కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి జీతాలు చెల్లిస్తామని సజ్జల తేల్చి చెప్పారు. వేతన బిల్లులను రూపొందిస్తున్న డీడీవోలను పని చేసుకోనివ్వకుండా ఉద్యోగ సంఘాల నేతలు అడ్డుకుంటున్నారని సజ్జల ఆరోపించారు. ఉద్యోగుల బాగోగుల గురించి ఉద్యోగ సంఘాల కంటే ఎక్కువగా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు సజ్జల.

Type-2 Diabetes: డిన్నర్ లేటవుతుందా.. షుగర్ పెరుగుతుందన్న మాటే..

చర్చలకు రావాలని పదే పదే ఉద్యోగ సంఘాల నేతలను కోరామన్నారు. ఫిట్ మెంట్ పై.. అప్పుడు ఓకే చెప్పారని, ఇప్పుడేమో మాట మారుస్తున్నారని సజ్జల అంటున్నారు. తెలంగాణ కంటే ఎక్కువ పీఆర్సీ ఇవ్వాలని సీఎం జగన్ భావించారని, అయితే అది సాధ్యం కాదని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారని సజ్జల తెలిపారు. ఉద్యోగ సంఘాలు చర్చలకు వచ్చి ఉంటే పాత జీతాలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి ఉండేదన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

”కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు చెల్లిస్తాం. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు, ఉద్యోగ సంఘ నాయకులు పెట్టిన మూడు డిమాండ్లకు సంబంధం లేదు. ముఖ్యమైన హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించటం లేదు. ఉద్యోగ సంఘాలు.. మంత్రుల కమిటీతో చర్చలకు వస్తే పాత జీతాలు చెల్లించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించి ఉండేది. కొత్త పే స్కేళ్లతో వేతన బిల్లులను రూపొందిస్తున్న డీడీఓలను పని చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. హెచ్ఆర్ఏ శ్లాబులపై నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తే దానిపై చర్చించడానికి మంత్రుల కమిటీ సిద్ధమే. ఉద్యోగ సంఘాల కంటే ఎక్కువే ఉద్యోగుల బాగోగుల గురించి ప్రభుత్వం ఆలోచించింది. పదే పదే చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాం.

ఆర్ధిక సమస్యల కారణంగా ఒకటీ రెండు అంశాలపైనే దృష్టి పెట్టాలని ఉద్యోగ సంఘాలకు ముందే చెప్పాం. ప్రాధాన్యత దృష్ట్యా ఫిట్ మెంట్ పై నిర్ణయమే కీలకమని ఉద్యోగ సంఘాలు చెప్పాయి. ఇప్పుడు మాటమార్చి మరోలా వ్యవహరించటం సరికాదు. ప్రెస్ మీట్ లో నా పక్కన నిలబడటానికి కొందరు పోటీ పడ్డారు. తెలంగాణ కంటే ఎక్కువ పీఆర్సీ ఇవ్వాలని సీఎం జగన్ అన్నారు. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అధికారులు సాధ్యం కాదని తేల్చి చెప్పారు” అని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.