Akhilesh Yadav: సూర్యుడు లేకుండా ఉదయం వచ్చినట్లు ఉంది.. తండ్రి ములాయం మరణంపై అఖిలేష్ ఎమోషనల్ ట్వీట్
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు మంగళవారం ఆయన స్వగ్రామమైన సైఫాయిలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు ములాయం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Akhilesh Yadav
Akhilesh Yadav: సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు మంగళవారం ఆయన స్వగ్రామమైన సైఫాయిలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు ములాయం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అయితే, బుధవారం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన తండ్రి ములాయం అంత్యక్రియలకు సంబంధించి రెండు ఫొటోలను ఉంచి.. సూర్యుడు లేకుండా ఉదయం వచ్చినట్లు తాను భావించానని అఖిలేష్ అన్నారు.
మూడు సార్లు ఉత్తర్‌ప్రదేశ్ సీఎంగా, కేంద్ర రక్షణ శాఖ మత్రిగా పనిచేసిన ములాయం సింగ్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనేకాక దేశ రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. గతకొంతకాలంగా అనారోగ్యంతో ఆయన మరణించారు. పార్టీలకతీతంగా అగ్రశ్రేణి రాజకీయ నేతలు ములాయంకు నివాళులు అర్పించేందుకు యూపీలోని ఇటావా జిల్లాలోని సైఫాయ్ వద్దకు తరలివచ్చారు.
आज पहली बार लगा…
बिन सूरज के उगा सवेरा. pic.twitter.com/XlboMo8G2V
— Akhilesh Yadav (@yadavakhilesh) October 12, 2022
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు ములాయం అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు.