tn election 2021 : కమల్ కూతురు, సుహాసిని తీన్మార్ డ్యాన్స్, వీడియో వైరల్

కమల్ కూతురు అక్షర..చేదోడువాదోడుగా నిలుస్తోంది. సినీ నటి సుహాసిని..ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

tn election 2021 : కమల్ కూతురు, సుహాసిని తీన్మార్ డ్యాన్స్, వీడియో వైరల్

Suhasini

Updated On : April 4, 2021 / 3:13 PM IST

akshara haasan and suhasini : భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల రంగంలోకి దూకిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. అభ్యర్థులకు మద్దతుగా పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన వారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. తమ వారిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

తమిళనాడులో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. ఏప్రిల్ 6 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు శాయశక్తుల కృషి చేస్తున్నాయి. అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదరగా…డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తులు కుదిరాయి. మూడవ కూటమి ఏర్పడిన మక్కల్ నీది మయ్యం, సమత్తువ మక్కల్ కట్చి, జననాయగ కట్చిలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఐజేకే కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ హాసన్ ఉన్నారు.

ఈయనకు మద్దతుగా పలువురు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. కమల్ కూతురు అక్షర..చేదోడువాదోడుగా నిలుస్తోంది. సినీ నటి సుహాసిని..ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కమల్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. ఓటర్లను కలుసుకున్న అక్షర, సుహాసినలు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. ఓటర్లను కూడా డ్యాన్స్ చేయాలని కోరడంతో వారు కూడా కాలు కదిపారు. కమల్ పార్టీ గుర్తుగా ఉన్న టార్చ్ లైట్ ను చేతిలో పెట్టుకుని సుహాసిని డ్యాన్స్ చేయడం విశేషం. మరి ఓటర్లు ఎలా తీర్పునిస్తారో చూడాలి మరి.