వెరైటీ ఎన్నికల ప్రచారం.. మెడలో చెప్పుల దండ వేసుకుని మరీ క్యాంపెయిన్
ఇది మరీ విచిత్రం.. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం నాయకులు రకరకాల విన్యాసాలు చేయడం కామనే కానీ..

Pandit Keshav Dev garland of slippers: దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం తలమునకలై ఉన్నాయి. ఆయా పార్టీలకు చెందిన అగ్రనాయకులతో పాటు అభ్యర్థులు కూడా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పండిట్ కేశవ్ దేవ్ వినూత్నంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. చెప్పుల దండ మెడలో వేడుకుని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆయన ఎందుకలా చేస్తున్నారని ఆశ్చర్యపోతున్నారా?
అలీగఢ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పండిట్ కేశవ్ దేవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆయనకు జోడు చెప్పులు(పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్) గుర్తు కేటాయించింది. దీంతో ఆయన పూలదడంతో పాటు చెప్పుల దండ కూడా మెడలో వేసుకుని వెరైటీగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. తన ఎన్నికల గుర్తును ఓటర్లు బాగా గుర్తు పెట్టుకునేందుకే 7 చెప్పులను దండగా చేసి మెడలో వేసుకున్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. అలీగఢ్ ఓటర్ల ఎంతమేరకు ఆయనను ఆదరిస్తారో చూడాలి.
కాగా, లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్నాయి. అత్యధికంగా 80 మంది ఎంపీ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ మొత్తం ఏడు దశల్లోనూ ఓటు వేయనుంది. ఏప్రిల్ 19న ఫస్ట్ పేస్, ఏప్రిల్ 26న సెకండ్ పేజ్, మే 7న థర్డ్ పేజ్, మే 13న ఫోర్త్ పేజ్, మే 20న ఫిఫ్త్ పేజ్, మే 23న సిక్త్ పేజ్, జూన్ 1న సెవెన్త్ పేజ్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అలీగఢ్‌లో ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.
Also Read: ఆమెరికాలో ఆగని మరణాలు.. కొన్ని వారాల క్రితం అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతి