దేవుడు ఆదేశించాడు : అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ

అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి తాను సిద్దమన్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సరే తాను రెడీగా ఉన్నానని శుక్రవారం(ఏప్రిల్-19,2019)రజనీ తెలిపారు.తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలతో పాటుగా 18అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ ఉప ఎన్నికలు అధికార అన్నాడీఎంకే ప్రభుత్వానికి అత్యంత కీలకమైనవి. ఈ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం మెజారిటీ సాధించడంలో విఫలమై మే-23,2019 తర్వాత ప్రభుత్వం రద్దయితే…అప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పారు.
తమిళనాడులో ఇటీవల పలు రాజకీయ పార్టీల నేతలు, ఇతరులపై ఈసీ, ఐడీ దాడుల్లో పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుబడటంపై అడిగిన ఓ ప్రశ్నకు, ఈసీ పనితీరు బాగుందని, దీనిపై ఇంతకుమించి మాట్లాడలేనని చెప్పారు. నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అవుతారా అని అడిగిన ప్రశ్నకు రజినీకాంత్ సూటిగా సమాధానమివ్వలేదు. మే- 23న తెలుస్తుందంటూ సమాధానమిచ్చారు.
Rajinikanth on being asked if he will contest state polls if AIADMK falls short of majority after assembly bypolls: Whenever it is announced I am ready. I will decide after May 23 #TamilNadu pic.twitter.com/mjfR10xeRg
— ANI (@ANI) April 19, 2019