Amarnath Yatra 2026 : అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు.. ఆరోజు నుంచే ప్రారంభం.. యాత్రలో వారికి మాత్రం అనుమతి లేదు..
Amarnath Yatra 2026 : దక్షిణ కశ్మీర్లో ప్రముఖ ఆధ్యాత్మిక అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ప్రతీయేటా వైభవంగా నిర్వహించే యాత్రకు సంబంధించి తేదీలు ఖరారయ్యాయి.
Amarnath Yatra
- అమర్నాథ్ యాత్రకు తేదీలు ఖరారు
- జులై 3 నుంచి యాత్ర ప్రారంభం
- ఆగస్టు 28న ముగియనున్న యాత్ర
Amarnath Yatra 2026 : దక్షిణ కశ్మీర్లో ప్రముఖ ఆధ్యాత్మిక అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ప్రతీయేటా వైభవంగా నిర్వహించే యాత్రకు సంబంధించి తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది యాత్ర జులై 3వ తేదీ నుంచి ప్రారంభమై.. మొత్తం 57రోజులు పాటు సాగనుంది. ఆగస్టు 28వ తేదీన యాత్ర ముగుస్తుంది.
Also Read : TS Inter Results 2026 : ఇంటర్లో ఫెయిలైన వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎప్పుడు.. ఫీజు ఎప్పుడు కట్టాలంటే?
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. యాత్ర చేపట్టాలనుకునే భక్తులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని సూచించారు. జమ్ముకశ్మీర్ బ్యాంకు, ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్ బ్యాంకులకు దేశవ్యాప్తంగా ఉన్న 554 శాఖల్లో దరఖాస్తుదారులు ముందస్తు నమోదులు చేసుకోవచ్చునని, అదేవిధంగా శ్రీ అమర్నాథ్ జీ పుణ్యే క్షేత్ర బోర్డు మండలి అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకునే అవకాశం ఉందని మనోజ్ సిన్హా తెలిపారు.
యాత్ర ప్రారంభానికి ముందు జూన్ 19న జైష్ఠ పౌర్ణమి సందర్భంగా తొలిపూజ నిర్వహించనున్నారు. ఈ యాత్ర రెండు ప్రధాన మార్గాల ద్వారా కొనసాగుతుంది. ఒకటి అనంతనాగ్ జిల్లాలోని 48 కిలో మీటర్లు నున్వాన్ – పహల్గాం సంప్రదాయం మార్గం. మరొకటి గందర్బల్ జిల్లాలోని 14 కిలోమీటర్ల బాల్టాల్ చిన్నదైన కఠినమైన మార్గం.
ఇదిలాఉంటే.. యాత్రలో పాల్గొనే భక్తులకు కనీస వయస్సు 13 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 70 సంవత్సరాలుగా నిర్ణయించారు. 13ఏళ్లకు తక్కువ ఉన్నా.. 70ఏళ్లకు ఎక్కువ వయస్సు ఉన్నా యాత్రకు అనుమతి లేదు.
