ఆన్‌లైన్‌లో ఆల్కహాల్.. డోర్ డెలివరీ.. ప్రభుత్వం అనుమతులు

  • Published By: vamsi ,Published On : June 20, 2020 / 07:54 AM IST
ఆన్‌లైన్‌లో ఆల్కహాల్.. డోర్ డెలివరీ.. ప్రభుత్వం అనుమతులు

Updated On : June 20, 2020 / 7:54 AM IST

పశ్చిమ బెంగాల్‌లో మద్యం సరఫరా చేయడానికి అమెజాన్ క్లియరెన్స్ పొందగా.. కరోనా సమయంలో రాష్ట్రంలో మద్యం వ్యాపారం ఆన్‌లైన్‌‌లో చేయడం మంచిదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బిగ్‌బాస్కెట్ కూడా రాష్ట్రంలో మద్యం పంపిణీ చేయడానికి అనుమతి పొందిందని నోటీసులో పేర్కొంది.

9 కోట్లకు పైగా జనాభా ఉన్న పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నాల్గవ రాష్ట్రం. అమెజాన్ రాష్ట్రంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. అయితే దీనిపై అమెజాన్ కానీ, బిగ్‌బాస్కెట్ కానీ స్పందించలేదు. ఐడబ్ల్యుఎస్ఆర్ డ్రింక్స్ మార్కెట్ అనాలిసిస్ అంచనాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో మద్యం పంపిణీ చేయడంలో అమెజాన్ 27.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 205 కోట్లు) విలువైన మార్కెట్లోకి ప్రవేశించింది. 

భారత్‌లోని టాప్ ఆహార డెలివరీ సంస్థలు Swiggy మరియు Zomato ఇప్పటికే మద్యం పంపిణీ ప్రారంభించింది. కరోనా, లాక్ డౌన్ కారణంగా అన్ని రకాల వ్యాపారాలు నష్టపోయి, ప్రభుత్వ ఖజానా ఖాళీ కాగా, నిబంధనల సడలింపు అనంతరం కొత్త కేసులు పెరుగుతుండడడంతో అక్కడి మమతా బెనర్జీ సర్కారు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Read: నిద్రాహారాలు మానేసి సుశాంత్ ఫోటోనే చూస్తూన్న పెంపుడు కుక్క