Mukesh Ambani: దుబాయిలో రూ.640 కోట్లతో లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన అంబానీ.. ఎవరికోసమో తెలుసా?
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ దుబాయిలో ఓ లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారట. దీని విలువ సుమారు రూ. 640 కోట్లు ఉంటుందట. ఈ విల్లా పక్కనే బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్, ఇతర దేశాలకు చెందిన ప్రముఖుల నివాసాలు ఉన్నాయట. ఇంతకీ ముఖేశ్ అంబానీ ఈ నివాసాన్ని ఎవరికోసం కొనుగోలు చేశారో తెలుసా..

Mukesh Ambani's luxurious house
Mukesh Ambani: అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచంలోని పలు దేశాల్లో విశాలమైన నివాసాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో ముకేశ్ కుటుంబానికి లగ్జరీ హౌస్‌లు ఉన్నాయి. గతేడాది బ్రిటన్‌లో ఓ విశాల సౌధాన్ని ముకేశ్ కుటుంబం కొనుగోలు చేసింది. అదేవిధంగా లండన్‌లో బకింగ్‌హాంషైర్ వద్ద ఉన్న 300 ఎకరాల్లోని స్టోక్ పార్క్ ను రూ. 592 కోట్లతో ముకేశ్ కుటుంబం కొనుగోలు చేసింది. అయితే దీన్ని ముకేశ్ పెద్ద కుమారుడు ఆకాశ్ కోసం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
Mukesh Ambani: ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపుతామంటూ బెదిరింపులు.. భద్రత పెంపు
కుమార్తె ఆశా అంబానీ కోసం న్యూయార్క్‌లో ఇల్లు వెతుకుతున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా దుబాయ్‌లో ఓ లగ్జరీ విల్లాను ముకేశ్ అంబానీ కుటుంబం కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విల్లాను ముకేశ్ ఎవరికోసం కొనుగోలు చేశాడో తెలుసా..? తన చిన్న కుమారుడు అనంత్ కోసమట. ఈ లగ్జరీ విల్లా అరబ్ నగరం దుబాయిలోని సుమద్ర తీరంలో రూ.640 కోట్లతో కొనుగోలు చేసినట్లు బ్లూమ్ బర్గ్ కథనం వెల్లడించింది. అయితే దుబాయిలో అదే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్ అని సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ లగ్జరీ విల్లాను ముకేశ్ అంబానీ కొనుగోలు చేశారట. కానీ ఈ సమాచారం బయటకు పొక్కకుండా అత్యంత గోప్యంగా ఉంచారు.
Mukesh Ambani : ముఖేశ్ అంబానీ వారసుల చేతుల్లోకి రిలయన్స్ సంస్థలు..RIL మరింత పరుగులు పెట్టబోతోందా ?
లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన ప్రాంతంలోనే ఓ బీచ్ కూడా ఉంటుందట. ఇందులో 10 పడకగదులు, ప్రైవేట్ స్పా, ఇండోర్, అవుట్ డోర్, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం ముకేశ్ కుటుంబం కొనుగోలు చేసిన లగ్జరీ విల్లా పక్కనే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నివాసంతో పాటు బ్రిటీష్ మాజీ ఫుట్బాల్ స్టార్ డేవిడ్ బెక్ హమ్ నివాసం ఉంది. ప్రస్తుతం ముకేశ్ కుటుంబం ముంబయిలోని యాంటిలియాలో నివాసముంటోంది. 27 అంతస్తులు కలిగియున్న ఈ భవనంలో మూడు హెలిపాడ్లు, 168 కార్ల కోసం పార్కింగ్, 50 మంది కుర్చుని చూసే సినిమా థియేటర్, తొమ్మిది ఎలివేటర్లు ఇతర అధునాతన సదుపాయాలు ఉన్నాయి.