బిగ్ బీ కి అస్వస్ధత : భయపడాల్సిందేమిలేదని వివరణ

ముంబై : బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. గత 36 ఏళ్ళుగా ఆయన ప్రతి ఆదివారం అభిమానులను తన ఇంటివద్ద కలుసుకుంటూ ఉంటారు. అనారోగ్య కారణాలతో ఈ వారం కలవలేక పోతున్నానని, ఒళ్లు నొప్పులతో బాధ పడుతున్నట్లు తన బ్లాగ్ లో తెలిపారు. అభిమానులకు, ఇతరులకు ఈ ఆదివారం దర్శన కుదరడంలేదు, నొప్పివల్ల బెడ్ మీదే ఉన్నాను. బయటకు రాలేక పోతున్నానని తన బ్లాగ్ లో రాశారు. 76 ఏళ్ళ అమితాబ్ ను చూడటానికి అభిమానులు ప్రతి ఆదివారం ఆయన ఇంటివద్ద క్యూ కడుతూ ఉంటారు. బిగ్ బీ వారిని పలకరించి వారితో కరచాలనం చేసి వారిని ఆనంద పరుస్తూ ఉంటారు.