కరోనా ఫైట్ కోసం అనిల్ అగర్వాల్ 100కోట్ల విరాళం

కరోనా ఫైట్ కోసం అనిల్ అగర్వాల్ 100కోట్ల విరాళం

Updated On : March 23, 2020 / 2:11 AM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ రూ.100కోట్లు ఆర్థిక సహాయం అందించనున్నారు. ‘మన దేశానికి ఈ సమయంలో ప్రస్తుతం కావాల్సిందిదే’ అని ఆదివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇదే సందర్భొంగా ఆయన పేదలకు సహాయం చేయాలనుకుంటున్నానని, ప్రత్యేకించి రాష్ట్రాల వారీగా చాలా జిల్లాల్లో ఉన్న పేదవారికి చేయూత అందివ్వడమే ఆయన ఆశయం. 

‘ఈ మహమ్మారి నుంచి పోరాడేందుకు రూ.100కోట్లు ఇవ్వాలనుకుంటున్నా. దేశ్ కీ జరూరతోన్ కే లియే అనే వాగ్దానం చేస్తున్నా. మన దేశానికి ప్రస్తుతం ఇదే కావాలి. ప్రత్యేకించి రోజువారీ కూలీలకు, మన వంతు సహాయం చేద్దాం’ అని వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. 

 

ఆనంద్ మహీంద్రా సైతం ముందుకొచ్చారు. ‘వచ్చే జీతాన్ని కొద్ది నెలల వరకూ డొనేట్ చేద్దామనుకుంటున్నా. భారత్ దాదాపు స్టేజ్ 3కి చేరుకుంది. లక్షల మంది కాజువాలిటీస్ కు వెళుతున్నారు. వైద్యానికి సంబంధించిన పరికరాలకు సహాయం కావాల్సిందే’ అని ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. దీంతో పాటు మహీంద్రా గ్రూప్.. వారి మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లతో వెంటలేటర్లు తయారుచేయడానికి వారెంతవరకూ సహాయపడగలరో ప్లాన్ చేస్తున్నారట. 

భారత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మిగిలిన బిజినెస్ వారు కూడా ముందుకు రావాలని సూచించారు. భారత్‌లో 330కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, లక్షల మంది స్వచ్ఛందంగా క్వారంటైన్ కు వెళ్లిపోయారు. 

See Also | తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్