ప్రో కబడ్డీలో కూడా ఇలాంటి స్టంట్ చూడలేదు

  • Published By: venkaiahnaidu ,Published On : November 16, 2019 / 05:55 AM IST
ప్రో కబడ్డీలో కూడా ఇలాంటి స్టంట్ చూడలేదు

Updated On : November 16, 2019 / 5:55 AM IST

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. సినీ హీరోల రేంజ్‌లో ఆనంద్ మహీంద్రాకు సోష ల్‌మీడియాలో కూడా లక్షల్లో అభిమానగణం ఉంది. సమకాలీన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తూ ఉంటే ఆయన ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆటలో అయినా జీవితంలో అయినా ఆఖరి నిమిషం వరకు పోరాడితే ఫలితం ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అంటూ కబడ్డీ మ్యాచ్ కు సంబంధించిన వీడియోను ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు. 

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో….ఓ ప్రాంతంలో కబడ్డీ మ్యాచ్ జరుగుతుంది. కూతకు వెళ్లిన ఓ ఆటగాడు ప్రత్యర్థి జట్టు ఆటగాడిని అవుట్ చేసి లైన్ దగ్గరకు చేరుకుంటాడు. అయితే తన కోర్టులోకి వెళ్లకుండా ఇంకా అక్కడే ఉండి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను రెచ్చగొడతాడు. ఇంతలో అవుట్ అయిన ఆటగాడు అక్కడికి వచ్చి కవ్విస్తున్న ఆ రైడర్‌ను ఒక్కసారిగా తమ కోర్టు లోపలికి లాగడంతో అందరూ వచ్చి మూకుమ్మడిగా అతడ్ని పట్టుకోవడం వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్ర.. ప్రొకబడ్డీ లీగ్‌లో ఇలాంటి సీన్ చూడలేదంటూ కామెంట్ చేశారు. పాయింట్ వచ్చేందుకు ఎలాంటి ఆస్కారం లేకపోగా, ప్రత్యర్థికి ఓ పాయింట్ కోల్పోయిన స్థితిలో కూడా పోరాటపటిమ ఉంటే ఎలాంటి ఫలితమైనా వస్తుందని సదరు ఆటగాడు నిరూపించాడు.  ఏదైనా చివరి వరకు పోరాడు అనే సందేశాన్ని ఇచ్చారు మహీంద్ర.