వామ్మో.. ఒక రాత్రికి లక్ష రూపాయలు..! ముంబైలో భారీగా అద్దెలు పెంచేసిన హోటల్స్

ముంబైలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ ఒక రాత్రికి ఏకంగా 5లక్షలు అద్దె వసూలు చేస్తోంది. ప్రెసిడెన్షియల్ సూట్ బుక్ చేసుకుంటే 90వేలు వసూలు చేస్తోంది.

వామ్మో.. ఒక రాత్రికి లక్ష రూపాయలు..! ముంబైలో భారీగా అద్దెలు పెంచేసిన హోటల్స్

Mumbai Hotel Rates : ముంబైలో హోటల్స్ ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. అమాంతం లగ్జరీ హోటల్స్ ధరలు పెరిగిపోయాయి. ఒక శాతం, రెండు శాతం కాదు ఏకంగా వందల రెట్లు అమాంతం పెరిగిపోయాయి. అయినా రూమ్స్ మాత్రం ఖాళీగా లేవు. ఈ నెల 17 వరకు లగ్జరీ హోటళ్లన్నీ కూడా ఫుల్ అయ్యాయి. ముంబైలో హోటల్స్ ధరలు ఇంతలా పెరిగిపోవడానికి కారణం అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహమే. రేపే అనంత్ అంబానీ-రాధిక వివాహం. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు.

వీరి వివాహానికి దేశ విదేశాల నుంచి బిలియనీర్స్ తో పాటు సెలెబ్రిటీలు, వీవీఐపీలు భారీగా తరలి వస్తున్నారు. వీరు ఉండటానికి ముందే హోటల్స్ బుక్ చేసుకున్నారు. అనంత్ అంబానీ-రాధిక మ్యారేజ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని ధరలు అమాంతం పెంచేశాయి ముంబైలోని లగ్జరీ హోటల్స్.

ముంబైలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ ఒక రాత్రికి ఏకంగా 5లక్షలు అద్దె వసూలు చేస్తోంది. ప్రెసిడెన్షియల్ సూట్ బుక్ చేసుకుంటే 90వేలు వసూలు చేస్తోంది. ఇక సోఫిటల్ రూ.66 వేలు వసూలు చేస్తోంది. ట్రైడెంట్ నారిమన్ పాయింట్, ఐటీసీ గ్రాండ్ లు కూడా భారీగా ధరలు పెంచేశాయి. నారిమన్ పాయింట్ లోని ట్రైడెంట్ ఒక రాత్రికి 36వేలు వసూలు చేస్తోంది. ఐటీసీ గ్రాండ్ సెంట్రల్ ధర 25వేలు దాటింది. ఇక ఒబెరాయ్ ముంబై ఏకంగా 63వేలకు పైగా వసూలు చేస్తోంది. తాజ్ ద ట్రీస్ లో 42వేలకు రూమ్ లు అందుబాటులో ఉన్నాయి. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని హాలీడే ఇన్ లో ఒక గది ధర 26వేలు పలుకుతోంది. బాంద్రా కుర్లాలోని ట్రైడెంట్ లో గదులు అసలు అందుబాటులోనే లేవు. సాధారణ రోజుల్లో ఒక నైట్ కు 13వేలు వసూలు చేసే ఒక హోటల్ ఇప్పుడు ఏకంగా 91వేలకు పైగా కస్టమర్ల నుంచి దండుకుంటోంది. అయినా చాలా చోట్ల రూమ్స్ దొరకడం లేదు. గదులన్నీ నిండిపోయినట్లు బోర్డులు పెట్టేస్తున్నారు.

Also Read : పెళ్లికి అతిథులను తీసుకురావడానికి 3 ఫాల్కన్-2000 జెట్లను రెంటుకి తీసుకున్న అంబానీ ఫ్యామిలీ