Anna Hazare : హింస కాదు, చర్చలే పరిష్కారం.. ధర్మేంద్ర రాజీనామాపై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు
Anna Hazare : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అన్నా హజారే స్పందించారు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం హింస కాదని, చర్చలు, శాంతియుత నిరసనలేనని అన్నారు. తాను 22 సార్లు నిరాహార దీక్షలు చేసినా ఎప్పుడూ హింసను ఆశ్రయించలేదని చెప్పారు.
Anna Hazare
Anna Hazare : నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలతో కేంద్రం దిగొచ్చింది. ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పందించారు. సమస్యలు ఎన్ని పెద్దవైనా కావొచ్చు.. హింస ద్వారా మాత్రం పరిష్కరించలేమని ఆయన స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామాలు, విద్యార్థుల నిరసనలపై హాజరే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే ప్రతి ప్రభుత్వం, నాయకుడి ప్రధాన లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజల డిమాండ్లను పరిష్కరించేందుకు అవసరమైతే ప్రభుత్వాలు 2 అడుగులు ముందుకు వేసినా తప్పులేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే ఉండాలన్నారు.
22 సార్లు నిరాహార దీక్షలు చేశా :
తాను చేసిన ఉద్యమాలపై కూడా అన్నా హజారే ప్రస్తావించారు. అహింసా మార్గంలోనే తాను పోరాడినట్టు తెలిపారు. ‘నా జీవితంలో 22 సార్లు నిరాహార దీక్షలు చేశా. ఎప్పుడూ హింసను ఆశ్రయించలేదు. అహింసాయుత మార్గంలోనే పోరాడాను. దాదాపు 10 చట్టాలు అమల్లోకి వచ్చాయి’ అని అన్నారు. హింస అనేది ఏ రూపంలో ఎవరి నుంచి వచ్చినా అది సరికకాదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.
Read Also : Vivo X300e Launch : బ్యాటరీలో బాహుబలి.. కెమెరాలో కింగ్! వివో X300e వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్..!
అలాగే ఆందోళనలు చేసినా శాంతియుతంగానే చేయాలని హాజారే సూచించారు. రాజీనామాలు, ఇతర డిమాండ్ల నెరవేర్చుకునేందుకు ప్రజాస్వామ్య పద్ధతులనే ఫాలో అవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రజల మాట వినాలన్నారు. అదే సమయంలో ప్రజలు కూడా సమస్యల పరిష్కారానికి చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పారు.
ప్రభుత్వాలకు, ప్రజలకు అన్నా హజారే సందేశం కూడా ఇచ్చారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా హింసను ఆశ్రయించకూడదన్నారు. శాంతియుత చర్చలు, ప్రజాస్వామ్య విధానాలతోనే శాశ్వత పరిష్కారాలు సాధ్యమవుతాయన్నారు. హింస క్షణిక ఆగ్రహామే అయినా అహింసే శాశ్వత మార్పుకు మార్గమని అన్నా హజారే వ్యాఖ్యానించారు.
