పద్మభూషణ్ ఇచ్చేస్తా : అన్నాహజారే

  • Published By: madhu ,Published On : February 4, 2019 / 04:28 AM IST
పద్మభూషణ్ ఇచ్చేస్తా : అన్నాహజారే

Updated On : February 4, 2019 / 4:28 AM IST

మహారాష్ట్ర : ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మాత్రం తనకిచ్చిన పద్మభూషణ్ అవార్డును తిరిగి కేంద్రానికి ఇచ్చేస్తానంటూ ప్ర‌ముఖ గాంధేయ‌వాది, సామాజిక కార్య‌క‌ర్త అన్నా హాజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన దీక్ష చేపట్టి 5 రోజులు గడుస్తున్నా కేంద్రంలో కదలిక లేకపోవడం అన్నాకు కోపం తెప్పిస్తోంది. లోక్ పాల్, లోకాయుక్తలను నియమించాలని…రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ 81 ఏళ్ల హాజారే మరోసారి దీక్ష చేపట్టారు. జనవరి 30వ తేదీన మహారాష్ట్రలోనలి రాలేగావ్ సిద్ధిలో దీక్షను స్టార్ట్ చేశారు. 

తనకు ఏమైనా అయితే మోడీని ప్రజలు నిలదీస్తారని ఇటీవలే వ్యాఖ్యానించిన ఆయన ఫిబ్రవరి 04వ తేదీ సోమవారం మీడియాతో మాట్లాడారు. రైతుల కోసం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన దీక్ష చేస్తుండడంతో బరువు తగ్గడం, బీపీ, షుగర్ అధికమయ్యాయని వైద్యలు పేర్కొంటున్నారు. ఇక అన్నా చేపట్టిన చేపట్టిన దీక్షకు శివసేన మద్దతు ప్రకటించింది. 1992లో అన్నాహజారేకు పద్మభూషణ్ అవార్డు లభించింది.