డిసెంబర్ 26 న కంకణ సూర్యగ్రహణం

స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య అనగా డిసెంబర్ 26, గురువారం 2019 న ఏర్పడే సూర్య గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. “ధనస్సు” రాశి మూల నక్షత్రం “మకర , కుంభ” లగ్నాలలో కేతు గ్రస్త కంకణ సూర్య గ్రహణం సంభవిస్తోంది. ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలలో కనబడుతుంది.
ఖగోళంలో ఈ గ్రహణం 3 గంటల 39 సెకండ్లు ఉంటుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాలలో కంకణోక్త సంపూర్ణ సూర్య గ్రహణం వేర్వేరు సమయాలలో ఉంటుంది. పై మూడు రాష్టాలు మినహాయించి మిగిలిన తెలంగాణ ,ఆంద్రప్రదేశ్ తో పాటు భారతదేశంలోని ఇతర రాష్టాలన్నింటిలో పాక్షిక సూర్యగ్రహణం గోచరిస్తుంది.
హైదరాబాదులో ఉదయం 8:08 నిముషాలకు సూర్యగ్రహణ స్పర్శ ప్రారంభమై మధ్యకాలం 9:30 చేరుకుంటుంది. ఉదయం 11 :10 నిమిషాలకు ” పుణ్యకాలం ” ముగుస్తుంది. గ్రహణ సమయంలో సూర్యుడు అగ్నివలయంలాగా గ్రహణం చుట్టూ కనపడతాడు. కేరళలోని చెరువుత్తూర్ లో దేశంలో అన్ని ప్రాంతాల్లో కంటే సూర్య గ్రహహణ దృశ్యం సుందరంగా కనపడబోతోంది. ప్రపంచంలో అతికొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఇంత స్పష్టంగా సూర్యగ్రహణం కనిపిస్తుంది. సూర్యగ్రహణం చూసే సమయంలో రక్షిత కంటి అద్దాలు లేకుండా డైరెక్టుగా సూర్యుడిని చూడవద్దని నేత్రవైద్యులు హెచ్చరిస్తున్నారు.
సూర్యుడికి , భూమికి మధ్య చంద్రుడు ప్రవేశించడంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది సూర్యగ్రహణం, చంద్రుడు సూర్యుడికి మధ్యలో నుండి అంచులో అగ్నివలయంలాగా కనిపిస్తాడు. భారతదేశంలోనే కాకుండా , సౌదీ అరేబియా, సుమత్రా, బార్నియో లాంటి ప్రాంతాల్లో కూడా సూర్య గ్రహణం దర్శనమిస్తుంది. ఎవరైన గ్రహణాన్ని గ్రహణ సమయంలో ప్రత్యక్షంగా చూడకూడదు . గర్భవతులు ఎలాంటి భయందోళనలు చెందనవసరం లేదు. గ్రహణ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ధ్యానం, జపం, ఆధ్యాత్మిక చింతనతో ఉంటే చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు.
మార్గశిర అమావాస్య నాటి అబ్ధిక కార్యక్రామాన్ని యధావిధిగా అపరాన్నకాలంలో జరుపుకోవచ్చును. గ్రహణ పట్టు, విడుపు మధ్యస్నానాలాచరించే వారు, వారికున్న మంత్రనుష్టానములతో ఆచరించి యధావిధిగా స్నానాదులు ఆచరించి నిర్విహించవచ్చును. గ్రహణం గురించి ఎవరూ ఎలాంటి భయం కాని అందోళన కాని చెందనవసరం లేదని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు.
Also Read :ఈ స్తోత్రం చదువుకుంటే గ్రహణ దోషం ఉండదు