Indians Reached Delhi : ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరికొంతమంది భారతీయులు.. నాలుగో విమానంలో ఢిల్లీకి చేరిన మరో 274 మంది
ఇప్పటికే మూడు విమానాల్లో భారతీయులు ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి క్షేమంగా తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్ నుంచి మూడో విమానంలో 197 మంది భారతీయులు ఢిల్లీకి సురక్షితంగా వచ్చారు.

Indians reached Delhi from Israel
Indians Reached Delhi From Israel : హమాస్ – ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ చేపట్టింది. ఆపరేషన్ అజయ్ కొనసాగుతోంది. తాజాగా ఇజ్రాయెల్ నుంచి నాలుగో విమానం ఢిల్లీకి చేరుకుంది. ఆ విమానంలో 274 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు.
ఇప్పటికే మూడు విమానాల్లో భారతీయులు ఇజ్రాయెల్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్ నుంచి తొలి విమానంలో 212 మంది భారతీయులు భారత్ కు తిరిగి వచ్చారు. 235 మంది భారతీయులు ఇజ్రాయెల్ నుంచి రెండో విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఇజ్రాయెల్ నుంచి 197 మంది భారతీయులు మూడో విమానంలో ఢిల్లీకి సురక్షితంగా చేరుకున్నారు.
Israel Attack : గాజాపై ఇజ్రాయెల్ సైన్యం గర్జన..హమాస్ నేతలే లక్ష్యంగా ముప్పేట దాడి
పాలస్తీనాలోని హమాస్ మిలిటింట్ గ్రూప్ ఇటీవల ఇజ్రాయెల్ పై మెరుపు దాడి చేసింది. ఒకేసారి 5 వేల రాకెట్ లను ప్రయోగించింది. ఈ దాడితో ఇజ్రాయెల్ లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి ప్రతిదాడులకు దిగింది. ఈ యుద్ధం రెండు వైపులా వేలాది మంది ప్రాణాను బలి తీసుకుంది.