మరో తేజస్ రైలు : జనవరి 17న ప్రారంభం
ప్రైవేట్ రైలు అయిన తేజస్ రైలు త్వరలో మరో మార్గంలో అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

ప్రైవేట్ రైలు అయిన తేజస్ రైలు త్వరలో మరో మార్గంలో అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
ప్రైవేట్ రైలు అయిన తేజస్ రైలు త్వరలో మరో మార్గంలో అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ నిర్ణయించింది. జనవరి 17న అహ్మదాబాద్-ముంబై మధ్య ఈ రైలు ప్రారంభించనుండగా.. జనవరి 19 నుంచి రైలు కమర్షియల్ రన్ మొదలవనుంది. గురువారం మినహా ఆరు రోజులు తేజస్ రైలు సేవలు అందించనుంది. ప్రస్తుతం ఢిల్లీ-లక్నో మధ్య తేజస్ రైలు నడుస్తోంది.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పోరేషన్ ఆధ్వర్యంలో లక్నో – ఢిల్లీల మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీస్తోంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో భారత దేశంలోని 50 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని భారతీయ రైల్వే శాఖ భావించింది. ఇందుకోసం ప్రైవేట్ భాగస్వాములను కూడా ప్రోత్సహించాలని యోచించింది. అంతేకాదు 150 ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లను కూడా నెట్‌వర్క్‌పై తిప్పాలని భావించింది. ఈ క్రమంలోనే తొలి ప్రైవేట్ రైలు తేజస్‌ను ప్రారంభించింది.
అక్టోబర్ 5వ తేదీన అధికారికంగా ప్రారంభమైన తేజస్ 80 నుంచి 85శాతం ఆక్యుపెన్సీని చూపించిదని అధికారులు చెప్పారు. ఇక అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 28 వరకు ఈ రైలు ప్రయాణించింది. ఆరు రోజులు మాత్రమే ఈ రైలు ప్రయాణిస్తుంది. మొత్తం 21 రోజులకు గాను ఈ రైలు నిర్వహణలో ఐఆర్‌సీటీసీకి అయిన ఖర్చు రూ. 3 కోట్లు. రోజుకు సగటున రూ.14 లక్షలు ఖర్చు చేసింది ఐఆర్‌సీటీసీ. ప్రయాణికులకు టికెట్ రూపంలో రూ.17.50 లక్షలు వసూలు చేసింది. ఢిల్లీ -లక్నో రూట్లో భారతీయ రైల్వేల కింద కాకుండా ఒక ప్రైవేట్ సంస్థ కింద రైలు నడవడం ఇదే తొలిసారి కావడం విశేషం.