Taj Mahal : వెన్నెల అందాల్లో తాజ్‌మహల్‌ను ఫ్రీగా చూడొచ్చు.. ఎప్పుడు.. ఎందుకు?
వరల్డ్ హెరిటేజ్ వీక్‌ను పురస్కరించుకొని ఈ నెల 19 శుక్రవారం తాజ్ మహల్‌తోపాటు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోని చారిత్రక కట్టడాలు ఉచితంగా చూడొచ్చని తెలిపింది.

Taj Mahal
Taj Mahal : పర్యాటకులకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. వరల్డ్ హెరిటేజ్ వీక్‌ను పురస్కరించుకొని ఈ నెల 19 శుక్రవారం తాజ్ మహల్‌తోపాటు అగ్రాకోట, ఫతేపూర్ సిక్రీ, సికంద్రాలోని అక్బర్ సమాధి, ఇత్మాద్ ఉద్ దౌలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోని చారిత్రిక కట్టడాలు ఉచితంగా చూడవచ్చు. సాధారణ రోజుల్లో తాజ్ మహల్ చూడాలంటే రూ.80 ఉంటుంది. విదేశస్తులకు రూ.1200 ఉంటుంది.
చదవండి : Taj Mahal : వెన్నెల అందాల్లో తాజ్ మహల్, నైట్ వ్యూయింగ్ డేట్స్
ఇక ఈ రోజు పౌర్ణమి కావడంతో వెన్నెల్లో తాజ్ మహల్ కనువిందు చేయనుంది. డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఆదేశాల మేరకు విదేశీ పర్యాటకులు కూడా ఉచితంగానే ప్రవేశం కల్పించనున్నారు ఆర్కియాలజీ అధికారులు. కాగా ఈ వారోత్సవాల మోటో పర్యాటకులకు వారి సుసంపన్నమైన వారసత్వంపై అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల లక్ష్యమని పేర్కొన్నారు. కాగా తాజ్ మహల్‌ను సాధారణ రోజుల్లో 5,000 మంది, సెలవు రోజుల్లో అయితే 10,000 మంది సందర్శిస్తుంటారు.