అంటార్కిటికా ఆనవాళ్లు : గడ్డకడుతున్న ఉత్తర భారతం

ఉత్తరభారతాన్ని చలి వణికిస్తోంది. ఇంట్లో నుంచి ఎవరూ కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. భారీగా మంచుకురుస్తూ దాదాపు రెండు నెలలుగా ప్రజలకు చలిపులి చుక్కలు చూపిస్తోంది. ఆర్కిటిక్ ప్రాంతంలో చలి పేళుల్లు కారణంగా ఉత్తరభారతంలో ఈ ఏడాది తీవ్రస్థాయిలో హిమపాతం ఉందని, గతేడాది డిసెంబర్ నుంచి పోలార్ వర్ టెక్స్(ధ్రువ సుడిగుండం) కారణంగా తీవ్రస్థాయిలో చలి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర భారతంలోని అనేక చోట్ల ఉస్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.
మంగళవారం(జనవరి 29, 2019) రాజస్థాన్ లోని చురులో -11డిగ్రీల సెల్సియస్ కి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అమెరికా, యూరప్ లో కూడా ఇదే స్థాయిలో పోలార్ వర్ టెక్స్ కారణంగా తీవ్రస్థాయిలో చలి ఉంది. హియాలయ ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, ఉత్తరఖాండ్, హిమాచల్ ప్రదేశ్, రాష్ట్రాల్లో హిమపాతంలో కూడిన వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు.
మంగళవారం శ్రీనగర్ లో -5.4 డిగ్రీలకు, పహల్గామ్ లో -13.7 డిగ్రీల సెల్సియస్ కు ఉస్ణోగ్రతలు పడిపోగా, సిమ్లాలో 0.8 డిగ్రీలు, కీలాంగ్ లో -16.2 డిగ్రీలకు ఉస్ఫోగ్రతలు పడిపోయాయి. ఉత్తరభారతంలోని కొన్ని చోట్ల సరస్సులు పూర్తిగా గడ్డకట్టిపోయాయి.