Health care: యాంటీబయాటిక్స్ అధికంగా వాడుతున్నారా.. ఆ వ్యాధులు కొనితెచ్చుకున్నట్లే..

ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా యాంటీబయాటిక్స్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. యాంటీబయాటిక్స్ వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందుతామన్న ఆలోచనలో అధికశాతం మంది ఇష్టారీతిలో యాంటీబయాటిక్స్ వినియోగిస్తున్నారు...

Health care: యాంటీబయాటిక్స్ అధికంగా వాడుతున్నారా.. ఆ వ్యాధులు కొనితెచ్చుకున్నట్లే..

Antibiotics

Updated On : May 16, 2022 / 8:54 AM IST

Health care: ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా యాంటీబయాటిక్స్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. యాంటీబయాటిక్స్ వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందుతామన్న ఆలోచనలో అధికశాతం మంది ఇష్టారీతిలో యాంటీబయాటిక్స్ వినియోగిస్తున్నారు. పలువురు వైద్యులుకూడా అవసరానికి మించి యాంటీబయాటిక్స్ ను రిఫర్ చేస్తున్నాయి. అయితే యాంటీబయాటిక్స్ తరచూ వినియోగిస్తూపోతే చివరకు పెను ప్రమాదం కొనితెచ్చుకోవటం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ బిర్మింగ్ హోమ్ నిర్వహించిన పరిశోధనల్లో యాంటీబయాటిక్స్ వినియోగం అధికంగా ఉన్నవారిలో రోగ నిరోధక వ్యవస్థలో లోపాలు ఏర్పడుతాయని గుర్తించారు.

Health Care : వయస్సు 40 దాటిందంటే?…

యాంటీబయాటిక్స్ అధిక వినియోగం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవటంతో ప్రమాదకరమైన ఫంగల్ వ్యాధులు సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో తేల్చారు. జీర్ణవాహికలోని ప్రయోజనకరమైన బాక్టీరియా నశించడంతో పాటు కాండిడా వంటి ఫంగి చేరుతాయని పరిశోధనలో గుర్తించారు. ఐసీయూలో పేషెంట్లకు అతిగా యాంటీబయాటిక్స్‌ అందిస్తే కేథటర్‌ నుంచి కూడా ఈ ఫంగస్‌ రక్తంలోకి సోకే ప్రమాదముందని తేలింది. అధ్యయనంలో భాగంగా ఎలుకలకు యాంటీబయాటిక్ మిశ్రమాన్ని ఇచ్చారు. కాండిడా ఫంగస్ సోకేలా చేశారు. వేరే ఎలుకల సమూహానికి యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా కేవలం ఫంగస్ ను సోకేలా చేశారు. ఈ క్రమంలో ఆశ్చర్యకర విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Health Tip : ఈ ఐదు డ్రింక్స్ లో విటమిన్ సి పుష్కలం

యాంటీబయాటిక్స్ వాడిన ఎలుకల్లో ఫంగస్ ఎక్కువ ఇన్ ఫెక్షన్ కలిగించినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఫంగల్ ఇన్ ఫెక్షన్ సోకితే మూత్ర పిండాలు బలహీనపడుతాయి. తీవ్ర అనారోగ్యం పాలవుతారు. కానీ తాజా పరిశోధనలో ఎలుకలను మూత్రపిండాల బలహీనత కన్నా యాంటీ బయాటిక్స్ మిశ్రమమే ఎక్కువ అనారోగ్యాన్ని కలిగించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సైటోకైన్స్ ను విడిగా ఔషధ రూపంలో అందిస్తే యాంటీబయాటిక్ అతిగా వాడటం వల్ల వచ్చే వ్యాధులు సోకిన వారిలో మెరుగుదల ఉంటుందని వారు పేర్కొన్నారు.