Health Tip : ఈ ఐదు డ్రింక్స్ లో విటమిన్ సి పుష్కలం

విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా..అంటు వ్యాధులు, ఇతర రోగాల నుంచి దూరం చేస్తుంది. ఇందులో చర్మ సంరక్షణ కీలకం.

Health Tip : ఈ ఐదు డ్రింక్స్ లో  విటమిన్ సి పుష్కలం

Skin

Vitamin C And Skincare : విటమిన్ సి…ఇది ఆరోగ్యానికి ఎంతో అవసరం. పలు కూరగాయలు, పండ్లలో ఈ విటమిన్ ఉంటుంది. విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చంటున్నార వైద్యులు. అంతేగాకుండా..చర్మ సంరక్షణ కూడా కాపాడుకోవచ్చంటున్నారు. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా..అంటు వ్యాధులు, ఇతర రోగాల నుంచి దూరం చేస్తుంది. ఇందులో చర్మ సంరక్షణ కీలకం. యవ్వనంగా కనిపించేందుకు విటమిన్ సి అధికంగా ఉండే డ్రింక్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

Kiwi

1. Kiwi Mojito : కివి..విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది. ఆహారంలో దీనిని జోడించాలని సూచిస్తున్నారు. చర్మ ఆరోగ్యం మెరుగుపరచడమే కాకుండా…శరీరాన్ని పునరేత్తజం కలిగించడం…శక్తిని ఇస్తుంది. దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. కొన్ని కివిలు తీసుకోవాలి. వీటికి కొంత నిమ్మరసం, తేనెను కలపాలి. తర్వాత పుదీన ఆకులతో అలంకరించి. తీసుకోవాలి.

Juce

2. Orange juice :  ఆరెంజ్ జ్యూస్. డ్రింక్స్ లో దీని స్థానమే దీనిది. ఆరోగ్యకరమైన డ్రింక్స్ లలో దీనికొక స్థానం ఉంది. నారింజ, సిట్రస్ పండ్లు విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది. ఈ డ్రింక్ ను తీసుకోవడం ద్వారా..చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా…రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహద పడుతుంది. తాజాగా చేసిన నారింజ రసంలో రుచి రావడం కోసం కొంత నిమ్మరం, తేనె జోడించండి.

Honey

3. Honey pineapple juice : పైనాపిల్ పండులో విటమిన్ సి, ఐరన్ ఉంటాయి. చర్మాన్ని మెరుగుపర్చడమే కాకుండా..జీర్ణప్రక్రియ బాగుండే విధంగా చూస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొన్న పైనాపిల్ ముక్కలను గ్రైండ్ చేసిన తర్వాత…నిమ్మరసంతో కలపాలి. ఇందులో కొంత తీపి కోసం తేనెను కలుపుకోండి.

Berry Punch

4 .Berry Punch : బెర్రీలు యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఫైబర్ లు ఉంటాయి. ప్రతి రోజు ఒక బెర్రీ జ్యూస్ ను తాగండి. దీనికి కొన్ని ఫ్రెష్ పాలు, పెరుగు, స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్ లు వేసి బాగా కలుపుకుని తాగాలి.

Apple

5. Apple Carrot : యాపిల్ క్యారెట్ బూస్ట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. విటమిన్ ఏ, సి, కె లు ఉంటాయి. యాపిల్, కారెట్లు, నిమ్మకాయలు జోడించడం వల్ల…ఆరోగ్యకరమైన డ్రింక్ సిద్ధమౌతుంది. రుచి కోసం కొద్దిగా తేనెను కలుపవచ్చు.