Omelette Man Of India : గుడ్డు లేకుండా ఆమ్లెట్ వేసుకోవచ్చు.. అవును నిజంగానే

ఆమ్లెట్ అంటే చాలామంది ఇష్టపడతారు. రకరకాలుగా వేసుకుని తింటారు. అయితే అందుకు ప్రిపరేషన్ చాలా అవసరం. అసలు ఎగ్ లేకుండానే హాయిగా ఆమ్లెట్ వేసుకోవచ్చని మీకు తెలుసా? అదెలాగో చదవండి.

Omelette Man Of India : గుడ్డు లేకుండా ఆమ్లెట్ వేసుకోవచ్చు.. అవును నిజంగానే

Omelette Man Of India

Updated On : August 2, 2023 / 2:43 PM IST

Omelette Man Of India : ఓ వైపు వర్షాలు పడుతున్నాయి. వేడి వేడి అన్నంలో ఆమ్లెట్ వేసుకుని తినాలనిపిస్తుంది. ఇక దాని ప్రిపరేషన్‌కి టైం పడుతుందే? అని విసుగు అనిపిస్తుంది. ఇన్‌స్టెంట్ పౌడర్‌తో ఆమ్లెట్ వేసుకోవచ్చు. అదెలా? ఎక్కడ దొరుకుతుంది? చదవండి.

Hair To Grow : జుట్టు పెరగటంతోపాటు సిల్కీగా, మెరుస్తూ ఉండాలంటే కోడి గుడ్డు తో ఇలా చేసి చూడండి !

కోడి గుడ్డుని రకరకాలుగా తింటారు. కొందరు ఉడకబెట్టి తెంటారు. కొందరు కూరలా వండుతారు. కొందరు ఆమ్లెట్ వేసుకుంటారు. అయితే దానిని పగలగొట్టాలి. గిలకొట్టి దానిలో ఉల్లిపాయలు, మసాలాలు దట్టించి తయారు చేసుకోవాలి. దానికోసం పెద్ద తతంగమే అవుతుంది. అసలు ఇంత కష్టపడకుండా అసలు గుడ్డే అవసరం లేకుండా కేరళకి చెందిన ఓ వ్యక్తి క్షణాల్లో ఆమ్లెట్ వేసుకునేలా ఇన్‌స్టెంట్ పౌడర్‌ని కనిపెట్టాడు.

 

కేరళ రామనట్టుకరకు చెందిన అర్జున్ నాయర్‌ని ‘ఆమ్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. తన టాలెంట్ ఉపయోగించి సరికొత్త ఆమ్లెట్ తయారీ విధాన్ని కనిపెట్టి విజయాన్ని సాధించాడు. ఆమ్లెట్ తయారీని అత్యంత సుళువుగా తయారు చేయడం ఎలాగో నిరూపించాడు. ఈ రెసిపీ రూపొందించడానికి ముందు అర్జున్ గుడ్డు లేకుండా ఆమ్లెట్ ఎలా తయారు చేయాలని చాలా ఆలోచించాడు. మూడు సంవత్సరాలు పైగా అనేక ప్రయోగాలు చేశాడు. అందుకోసం చాలా డబ్బు ఖర్చు చేశాడు. ఫైనల్‌గా తను అనుకున్నది సాధించి రూ.2 కోట్ల రూపాయలతో ‘ధన్స్ డ్యూరబుల్’ అనే పేరుతో కంపెనీని స్ధాపించాడు. కిడ్స్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్, ఎగ్ బుర్జీ వంటి కొత్త రకాల ఫ్లేవర్స్‌ని కస్టమర్లకు పరిచయం చేశాడు.  రూ.5 నుంచి రూ.100 ధరలో  ప్యాకెట్లలో మార్కెట్లోకి తీసుకువచ్చాడు. ఈ పౌడర్ నాలుగు నెలలు నిల్వ ఉంటుందట.

రోజు కోడి గుడ్డు తింటే మధుమేహం ముప్పు.!

ఇతను రూపొందించిన ఇన్ స్టెంట్ ఆమ్లెట్ పౌడర్ ప్రాడక్ట్స్‌‌ని హైదరాబాద్, పూణే, చెన్నై, యూకే, కువైట్‌లలో మార్కెట్ చేసుకుంటున్నాడు. 2021 లో తన వ్యాపారం మొదలుపెట్టిన అర్జున్ దగ్గర 7 మహిళలతో సహా 12 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఎగ్‌లెస్ ఆమ్లెట్ ఎలా ఉంటుంది? అంటే ఇన్‌స్టెంట్ పౌడర్ కొని వేసుకుని తింటే తెలుస్తుంది.