గడ్డకట్టే చలిని తట్టుకునేలా…లడఖ్ లోని జవాన్లకు ప్రత్యేక దుస్తులు

  • Published By: venkaiahnaidu ,Published On : November 5, 2020 / 11:00 AM IST
గడ్డకట్టే చలిని తట్టుకునేలా…లడఖ్ లోని జవాన్లకు ప్రత్యేక దుస్తులు

Updated On : November 5, 2020 / 12:43 PM IST

Army troops deployed along LAC being provided cold weather clothing సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ సైనికులు లడఖ్ లో శీతాకాలంలో విపరీతంగా ఉండే చలిని తట్టుకునేందుకు అవసరమయ్యే దుస్తులను అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసింది. లడఖ్‌లోని ఎల్‌ఐసి వెంట మోహరించిన ఆర్మీ దళాలకు చలిని తట్టుకునే దుస్తులతో పాటుగా, సిగ్ సౌర్ అసాల్ట్ రైఫిల్స్ అందించబడ్డాయి.



చైనాని నిలువరించేలా లడాఖ్ లో సైనికులు విధులు నిర్వహించాలంటే ఎముకలు కొరికే చలిలో శరీరానికి వెచ్చదనాన్ని అందించే దుస్తులు సైన్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అమెరికా నుంచి కేంద్రం నుంచి కొనుగోలు చేసిన దుస్తుల్లో,సిగ్ సౌర్ అసాల్ట్ రైఫిల్స్ పట్టుకొని ఉన్న భారత సైనికులు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి