Rahul Gandhi: నన్ను కూడా అరెస్ట్ చేయండి.. వ్యాక్సిన్ పాలసీపై ప్రశ్నించిన 25మందిని అరెస్టుపై రాహుల్ గాంధీ

వ్యాక్సిన్ పాలసీపై ప్రధాని మోడీని విమర్శిస్తూ ఢిల్లీలో నిరసన చేసిన 25మంది అరెస్టుపై రాహుల్ గాంధీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన కాంగ్రెస్ లీడర్..

Rahul Gandhi: నన్ను కూడా అరెస్ట్ చేయండి.. వ్యాక్సిన్ పాలసీపై ప్రశ్నించిన 25మందిని అరెస్టుపై రాహుల్ గాంధీ

Arrest Me Too Rahul Gandhi Tweets Poster Criticising Pms Vaccine Policy Which Led To 25 Arrests In Delhi

Updated On : May 16, 2021 / 4:17 PM IST

Rahul Gandhi: వ్యాక్సిన్ పాలసీపై ప్రధాని మోడీని విమర్శిస్తూ ఢిల్లీలో నిరసన చేసిన 25మంది అరెస్టుపై రాహుల్ గాంధీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన కాంగ్రెస్ లీడర్.. నన్ను కూడా అరెస్ట్ చేయండి అంటూ ట్వీట్ చేశారు. ‘మోడీజీ మా పిల్లల వ్యాక్సిన్ ను విదేశాలకు ఎందుకు పంపించారు’ అని ఆ పోస్టర్లలో ఉంది.

దీనిని కాంట్రవర్సీ చేయాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ ఆ పోస్టర్లనే ప్రొఫైల్ పిక్చర్ కింద మార్చాయి. ఇదే పోస్టర్ ను ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ పోస్టర్ ను షేర్ చేయడంతో పూర్తి వ్యవస్థే ఆందోళనలో పడింది. అంటూ పోస్టు చేసింది.

మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ శనివారం రాత్రి ధైర్యముంటే తనను అరెస్టు చేయాలని పోలీసులకు సవాల్ విసిరారు. ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టడం నేరమా.. మోడీ పీనల్ కోడ్ తో రన్ అవుతుందా ఇండియా. మహమ్మారి చెలరేగుతున్న సమయంలో ఢిల్లీ పోలీసులు పని లేకుండా ఉన్నారా.. రేపు ఉదయం అవే పోస్టర్లను నా గోడ మీద అంటిస్తా. వచ్చి నన్ను పట్టుకోండి’ అంటూ ఢిల్లీ పోలీసులను, అమిత్ షాను ట్యాగ్ చేస్తూ పోస్టు చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లతో ప్రచారం చేస్తున్న 12మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనావైరస్ మహమ్మారి నియంత్రణను హ్యాండిల్ చేస్తున్న వైఖరిపై మోడీపై దుష్ప్రచారం చేయడాన్ని గుర్తించారు.

వారిపై 13 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసినట్లుగా వెల్లడించారు. నాలుగు డివిజన్లలో వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశారు. ‘మోడీ జీ, ఆప్నే హమారే బచ్చోన్ కీ వ్యాక్సిన్ విదేశ్ క్యో భేజ్ దియా?’ (మోడీ గారూ.. మా పిల్లల వ్యాక్సిన్ ను మీరు విదేశాలకు ఎందుకు పంపించేశారు). అంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి.

తూర్పు ఢిల్లీలోని కళ్యాన్ పురి ఏరియాలో గురువారం ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రధాని మోడీని విమర్శిస్తూ ఉండగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 800 పోస్టర్లను, బ్యానర్లను రికవర్ చేసినట్లుగా తెలిపారు.