బీజేపీలో చేరిన “బుల్లితెర రాముడు”అరుణ్ గోవిల్
ప్రముఖ రామాయణ సీరియల్లో రాముని పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్ గురువారం(మార్చి-18,2021) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

Arun Govil Televisions Most Famous Lord Ram Joins Bjp
Arun Govil ప్రముఖ రామాయణ సీరియల్లో రాముని పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్ గురువారం(మార్చి-18,2021) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
1980లలో టీవీ తెరపై టెలికాస్ట్ అయిన ‘రామాయణ’ ఓ సంచలనం. 2003 వరకు టీవీ తెరలపై కనువిందు చేసిన రామాయణ సీరియల్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధిక వ్యూయర్‌షిప్ సంపాదించిన పౌరాణిక ధారావాహికగా గుర్తింపు పొందింది. ఆ సీరియల్ ద్వారా విశేష ప్రేక్షకుల అభిమానం పొందిన నటుడు అరుణ్ గోవిల్. రాముడు ఎలా ఉంటాడు అనడిగితే.. అరుణ్ గోవిల్ మాదిరిగా ఉంటాడు అనేంతలా బుల్లితెరపై ఆయన పాపులర్ అయ్యారు.

Ram
కరోనా కారణంగా గతేడాది లాక్‌డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితమైన జనం.. రామాయణ, మహాభారత సీరియళ్లను తిరిగి ప్రసారం చేయాల్సిందిగా అభ్యర్థించగా.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ రెండు సీరియళ్లను తిరిగి ప్రసారం చేసింది. లాక్‌డౌన్‌లో రామాయణ సీరియల్ మరోసారి ప్రేక్షకాధరణ పొందింది. అప్పట్లో టీవీ తెరపై తన రాముడి పాత్రను వీక్షిస్తున్న అరుణ్ గోవిల్ ఫొటో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన గోవిల్ ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీర్‌గా పనిచేసేవారు. ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు తిరిగే వారు. ఈ కారణంగా గోవిల్ విద్యాభ్యాసం షహరాన్‌పూర్, షాజహాన్‌పూర్ మధ్య పలు ప్రాంతాల్లో సాగింది. మీరట్‌లో బీఎస్సీలో చేరారు. మథురలో బీఎస్సీ పూర్తి చేశారు.