ఏమైనా జరుగవచ్చు : అమెరికాలాగా మేం కూడా చేయగలం

  • Published By: venkaiahnaidu ,Published On : February 27, 2019 / 10:03 AM IST
ఏమైనా జరుగవచ్చు : అమెరికాలాగా మేం కూడా చేయగలం

Updated On : February 27, 2019 / 10:03 AM IST

భారత్ పై దాడి చేసే ఏ ఒక్క టెర్రరిస్ట్ ని వదిలిపెట్టే ప్రశక్తే లేదని బుధవారం(ఫిబ్రవరి-27,2019)ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సృష్టం చేశారు. పాక్ లోని అబోటాబాద్ లో ఒసామా బిన్ లాడెన్ ను అంతమొందించేందుకు 2011లో అమెరికా నిర్వహించిన ఆపరేషన్ ను ఈ సందర్భంగా జైట్లీ ప్రస్తావించారు. భారత్ కూడా ఇలాగే చేయగలదని అన్నారు.

ఇది కేవలం ఊహాల్లో మాత్రమే ఉండాలన్ని ఆశిస్తున్నానని, అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా  ఏదైనా జరుగవచ్చని,ప్రజలు అలర్ట్ గా ఉండాలని జైట్లీ తెలిపారు. ఏ దేశానికైనా ఓ వారం చాలా ఎక్కువ సమయమని, గడిచిన 24గంటలు చూస్తే ఒకవారం మొత్తం ఒక రోజులో కన్పిస్తుందని జైట్లీ అన్నారు.
Also Read: అణ్వాయుధాల టీమ్ తో ఇమ్రాన్ ఎమర్జన్సీ మీటింగ్

మంగళవారం(ఫిబ్రవరి-27,2019) పాక్ లోని బాలా కోట్ లోని జైషే ఉగ్రశిబిరాలే టార్గెట్ గా భారత వాయుసేన మెరుపు దాడులు చేసి 300మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీంతో సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

భారత్ కూడా పాక్ చర్యలను ధీటుగా తిప్పికొడుతోంది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ సమయంలో ఏమైనా జరుగవచ్చు అన్న జైట్లీ ప్రకటించడం, పాక్ పై భారత్ యుద్ధానికి సిద్ధంగా ఉందన్న సంకేతం ఇచ్చినట్లుగా కన్పిస్తోంది.
Also Read:పాక్ ను తక్కువ అంచనా వేయొద్దు : ప్రతిచర్య చూపించామన్న ఇమ్రాన్ ఖాన్