Arvind Kejriwal: గుజరాత్ లో అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉంది: ఆప్ ని చూసి బీజేపీ భయపడుతుందన్న కేజ్రీవాల్

గుజరాత్‌లో ఆప్‌ని చూసి బీజేపీ భయపడుతోందని, ఇప్పటికే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలను ప్రకటించవచ్చని శనివారం ఆయన ట్వీట్ చేశారు.

Arvind Kejriwal: గుజరాత్ లో అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉంది: ఆప్ ని చూసి బీజేపీ భయపడుతుందన్న కేజ్రీవాల్

Kejri

Updated On : April 30, 2022 / 9:51 PM IST

Arvind Kejriwal: గుజరాత్‌లో బీజేపీ ముందస్తుగా అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో ఆప్‌ని చూసి బీజేపీ భయపడుతోందని, ఇప్పటికే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలను ప్రకటించవచ్చని శనివారం ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీలో ప్రధాని నివాసంలో గుజరాత్ బీజేపీ నేతల సమావేశం సందర్భంగా కేజ్రీవాల్ ఈ ట్వీట్ చేశారు. హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపిందర్ పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్ సహా గుజరాత్ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు ప్రధానమంత్రి మోదీ నివాసంలో ఉన్నారు. గుజరాత్‌లో అసెంబ్లీ పదవీకాలం 2023 ఫిబ్రవరి 18తో ముగియనుంది. గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

Also Read:Prashant Kishor: మూడో కూటమి, నాలుగో కూటములు ఎన్నికల్లో గెలుస్తాయని నేను అనుకోవడం లేదు: ప్రశాంత్ కిశోర్

ఈ ఏడాది నవంబరు-డిసెంబర్‌లో గుజరాత్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 79 సీట్లు గెలుచుకుంది. అయితే గత ఏడాది జరిగిన సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్వల్ప విజయం నమోదు చేసుకుంది. ఈనేపధ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని ఇరుకున పెట్టేందుకు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. కాగా పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన తర్వాత గుజరాత్‌పై కన్నేసింది. గుజరాత్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌ను పార్టీ అధిష్టానం గత నెలలో నియమించింది. పంజాబ్ ఎన్నికల్లోనూ పాఠక్ ప్రచార భాద్యతలు నిర్వహించారు.

Also read:Viral News: బెంగాల్ పులికి ప్రభాస్ పేరు.. ఇదెక్కడి ఎలివేషన్ బాబోయ్!