Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ ఏడోసారి నోటీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు..

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ ఏడోసారి నోటీసులు

ED Notices To Arvind Kejriwal

Updated On : February 22, 2024 / 1:43 PM IST

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఏడోసారి నోటీసులు పంపించింది. ఫిబ్రవరి 26న విచారణకు హాజరుకావాలని చెప్పింది. ఇప్పటి వరకు ఆరుసార్లు సమన్లు పంపినా వివిధ కారణాలతో కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు.

విచారణకు హాజరుకాకపోవడంతో ఇప్పటికే కేజ్రీవాల్‌పై దీనికి సంబంధిం ఈడీ కేసు నమోదు చేసింది. కోర్టును సైతం ఆశ్రయించింది. మరోవైపు, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సీబీఐ దాఖలు చేసింది. విచారణ వివరాలను వెల్లడించరాదని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ మార్చి 12 వాయిదా వేసింది.

మాజీ మంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మార్చి 12 పొడిగించింది. 18 నెలలుగా లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. లిక్కర్ కేసు నిందితులకు వరుసగా దర్యాప్తు సంస్థలు నోటిసులు జారీ చేస్తున్నాయి. తాజాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు మరింత హాట్ టాపిక్ గా మారింది.

కేంద్ర సర్కారు తమను ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రధాని మోదీ వాడుకుంటూ తమ మీదకు వదులుతున్నారంటూ ఆప్ ఆరోపణలు చేస్తోంది.

Kamal Haasan: పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన కమల హాసన్