సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన కేజ్రీవాల్ కుమార్తె

Kejriwal’s daughter ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుతురు హర్షిత కేజ్రీవాల్ సైబర్ మోసానికి గురయ్యారు. ఆన్లైన్ సంస్థ ఓఎల్ఎక్స్లో ఆమె అమ్మకానికి పెట్టిన ఓ వస్తువును కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బు చెల్లించకపోగా.. ఆమె ఖాతా నుంచే నగదు బదిలీ చేసుకున్నాడు.
కేజ్రీవాల్ కుమార్తె ఇటీవల ప్రముఖ ఆన్లైన్ కొనుగోలు సంస్థ ఓఎల్ఎక్స్లో ఓ సోఫాని 34వేలకు అమ్మకానికి పెట్టింది. వీటిని చూసిన ఒక వ్యక్తి ఆమెను సంప్రదించాడు. ఆ వస్తువులను కొనుగోలు చేసిన అనంతరం ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లిస్తానని చెప్పాడు.
డీల్ ఫైనల్ అయిన తర్వాత సదరు వ్యక్తి హర్షిత కేజ్రీవాల్ మొబైల్‌కి ఒక క్యూఆర్ కోడ్ పంపి.. ఆ కోడ్‌ను స్కాన్ చేయగానే మీ అకౌంట్లో డబ్బు జమ అవుతుందని నమ్మించాడు. ఆ వ్యక్తి చెప్పినట్టే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే.. హర్షిత ఖాతా నుంచి నిందితుని అకౌంట్‌కి 34,000రూపాయలు బదిలీ అయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసు విభాగం.. కేసును సైబర్ సెల్‌కు బదిలీ చేసినట్టు తెలిపింది.