Aryan Khan case: బైజూస్ యాడ్ నుంచి షారుఖ్ ఔట్
బైజూస్ ఎడ్యూ టెక్ మేజర్ తమ సర్వీసుల అడ్వైర్టైజింగ్ లో కనిపించే షారుఖ్ ఖాన్ ను తప్పించింది.

Shah Ruikh Khan
Aryan Khan case: బైజూస్ ఎడ్యూ టెక్ మేజర్ తమ సర్వీసుల అడ్వైర్టైజింగ్ లో కనిపించే షారుఖ్ ఖాన్ ను తప్పించింది. అతని కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇలా వ్యవహరించినట్లు ఇంగ్లీష్ మీడియా చెప్పింది. కొద్ది రోజులుగా ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లో కంపెనీపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో అడ్వాన్స్ బుకింగ్స్ అన్నింటినీ ఆపేశాయి.
షారుఖ్ ఖాన్ అతిపెద్ద స్పాన్సర్ షిప్ ఒప్పందాలలో ఒకటి బైజూస్. హ్యూండాయ్, ఎల్జీ, దుబాయ్ టూరిజం, ఐసీఐసీఐ, రిలయన్స్ జియో వంటి అనేక కంపెనీలతో కూడా షారుఖ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
……………………………………………………….: గూగుల్ కొత్త పాలసీ.. ఇలా చేస్తే మానిటైజేషన్ పోతుంది.. జాగ్రత్త!
ఈ బ్రాండ్ ప్రమోషన్ కోసం.. 2017 నుండి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న షారుఖ్‌కు బైజు సంవత్సరానికి రూ.3-4 కోట్లు చెల్లిస్తూ వస్తుంది. భారతదేశంలో అతిపెద్ద స్టార్టప్, బైజు, కొన్ని సంవత్సరాలుగా బ్రిక్, మోర్టార్ కోచింగ్ ఇనిస్టిట్యూట్, ఆకాష్ ఇనిస్టిట్యూట్‌తో సహా అనేక కొనుగోళ్లు జరిగాయి.
బైజూస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆర్యన్ ఖాన్ పై ఆరోపణలే కారణమని తెలుస్తుంది. కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడిని పూర్తిగా తొలగించిందా అనే దానిపై స్పష్టత రాలేదు.
బైజు విలువ ఏప్రిల్‌లో 16.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం కంపెనీ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్, కుటుంబ విలువ రూ.24వేల 300 కోట్లు.
ఆర్యన్ ఖాన్, మరో ఏడుగురు గత వారం ముంబై నుండి గోవాకు ప్రయాణిస్తున్న ‘కార్డెలియా’ అనే క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ తో పట్టుబడ్డారు. అండర్ కవర్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) దాడుల్లో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల హషిష్, 22 మాత్రలు ఎండిఎమ్‌ఎ, 5 గ్రాముల ఎండిని స్వాధీనం చేసుకున్నారు.