Asaduddin Owaisi : చావుకి భయపడను.. జెడ్ కేటగిరీ భద్రత అవసరం లేదు- అసదుద్దీన్ ఒవైసీ
తాను చావుకి భయపడే వ్యక్తిని కాదన్నారు ఒవైసీ. తనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అసవరం లేదని, దాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకు భద్రత లభిస్తే తనకూ లభించినట్లే అన్నారు.

Asaduddin Owaisi
Asaduddin Owaisi : ఉత్తరప్రదేశ్ లో తన కారుపై జరిగిన కాల్పుల అంశాన్ని లోక్ సభ దృష్టికి తీసుకెళ్లారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. తాను చావుకి భయపడే వ్యక్తిని కాదన్నారు ఒవైసీ. తనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అసవరం లేదని, దాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకు భద్రత లభిస్తే తనకు లభించినట్లే అని అన్నారు. కాగా, కాల్పులు జరిపిన నిందితులను UAPA కింద శిక్షించాలని డిమాండ్ చేశారు.
Worst Passwords: ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నారా? వెంటనే మార్చుకోండి.. సెకన్లలో హ్యాక్ చేసేస్తారు
యూపీ ఎన్నికల నేపథ్యంలో మేరఠ్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఢిల్లీ వెళ్తుండగా ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. దీంతో అసదుద్దీన్‌కు తక్షణమే సీఆర్‌పీఎఫ్ బలగాలతో జడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, తనకు జడ్ కేటగిరీ భద్రత అక్కర్లేదన్న అసద్.. అందరిలాగే తాను ‘ఏ కేటగిరీ’ పౌరుడిగానే ఉండాలనుకుంటున్నట్టు తెలిపారు.
కాల్పులు జరిపిన వారిని చూసి తాను ఏమాత్రం భయపడనన్నారు ఒవైసీ. దాడి చేసిన వారికి యూపీ యువకులు బ్యాలెట్ ద్వారా సమాధానం ఇస్తారని.. యూపీలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తనపై కాల్పులు జరిపిన వారిపై యూఏపీఏ చట్టం ఎందుకు ప్రయోగించరని ప్రశ్నించారు. దేశంలో పేదలు, మైనార్టీలకు భద్రత ఉంటే తనకూ ఉన్నట్టేనని చెప్పారు. దేశంలోని పేదలు బాగుంటేనే తానూ బాగుంటానన్నారు. తనపై కాల్పులు జరిపిన వారిని శిక్షించి.. తనకు న్యాయం చేయాలని కోరారు.
ఒవైసీ కారుపై కాల్పుల ఘటన నేపథ్యంలో ఆయనకు ‘జడ్’ కేటగిరీ భద్రత కల్పిస్తూ శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. జడ్ కేటగిరీ కింద 22 మంది భద్రతా సిబ్బందితోపాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కేటాయించనుంది. వీరిలో నలుగురు నుంచి ఆరుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసు సిబ్బంది కూడా ఉంటారు. అయితే జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఆయన తిరస్కరించారు.
Omicron: ఒమిక్రాన్ ఒకే మనిషికి మళ్లీ మళ్లీ వస్తదా..
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై గురువారం ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరగడం కలకలం రేపింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగి వస్తుండగా హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. అయితే, ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. ఒవైసీ సురక్షితంగా బయటపడ్డారు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉంటాయని ఒవైసీ అనుమానం వ్యక్తం చేశారు.