Cabinet Expansion: రాజీనామా చేయమన్నారు.. అవినీతి మరకల్లేకుండా బయటకొచ్చా.. సంతోషమే!

Cabinet Expansion: రాజీనామా చేయమన్నారు.. అవినీతి మరకల్లేకుండా బయటకొచ్చా.. సంతోషమే!

Babool

Updated On : July 8, 2021 / 11:51 AM IST

Cabinet Expansion: పర్యావరణ మంత్రిత్వశాఖలో జూనియర్ మంత్రి పదవికి రాజీనామా చేసిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు బాబుల్ సుప్రియో.. మోదీ మంత్రి వర్గం నుంచి వైదొలగుతున్నందుకు చాలా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎలాంటి అవినీతి మరక లేకుండా బయటకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

రిఫ్రెష్ కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కొత్త కేంద్ర మంత్రివర్గంలో బెంగాల్ నుంచి చోటు దక్కించుకున్న కొంతమంది నాయకులను సుప్రియో అభినందించారు. తనకు కేబినెట్‌లో పనిచేసేందుకు అవకాశం ఇచ్చినందుకు మోదీకి థ్యాంక్స్ చెప్పారు. ఫేస్‌బుక్‌ అకౌంట్ లో తన ఆవేదనని వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు.

“ఎక్కడైనా పొగ వస్తుందంటే, ఎక్కడో ఒకచోట మంట ఉండాలి. నన్ను పట్టించుకునే మీడియా.. నా స్నేహితుల ఫోన్ కాల్స్ తీసుకోలేకపోతున్నాను కాబట్టి వారందరి కోసం ఫేస్‌బుక్ పోస్ట్ పెడుతున్నాను. ” నన్నురాజీనామా చేయమని అడిగారు.. చేశాను.. కారణం మాత్రం తెలియలేదు” అని సుప్రియో ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించారు.