Pretends as Magistrate: లాక్‌డౌన్‌లో గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ.. మెజిస్ట్రేట్ అని నమ్మించబోయి..
ప్రేమ కోసం పడరాని పాట్లు పడతారని తెలుసు కానీ, లాక్ డౌన్ ను కూడా బ్రేక్ చేసి వెళ్లేంత రిస్క్ చేయడం ఇదే కాబోలు. తన ప్రియురాలి బర్త్ డే కోసం........

Assam Man
Pretends as Magistrate: ప్రేమ కోసం పడరాని పాట్లు పడతారని తెలుసు కానీ, లాక్ డౌన్ ను కూడా బ్రేక్ చేసి వెళ్లేంత రిస్క్ చేయడం ఇదే కాబోలు. తన ప్రియురాలి బర్త్ డే కోసం ఏకంగా జిల్లా మెజిస్ట్రేట్ అని నమ్మించబోయాడో వ్యక్తి. దీని కోసం పెద్ద ప్లాన్ వేసే బయల్దేరినా చివరికి పోలీసులకు దొరికిపోయాడు.
అస్సాంలోని జొర్హాట్ జిల్లాకు చెందిన తీతాబోర్ టౌన్ లో ఈ ఘటన జరిగింది. బిస్వజిత్ దత్తా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును అద్దెకు తీసుకుని గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి అటెంట్ అవ్వాలని ప్రయత్నించాడు. జిల్లా మెజిస్ట్రేట్ అనే ప్రింట్ అవుట్ తీసి అద్దె కారుకు అతికించాడు.
ఆ కార్ డ్రైవర్ కు డబ్బులిస్తానని చెప్పి బయల్దేరాడు. ‘అతణ్ని బర్త్ డే పార్టీకి తీసుకెళ్లాను. నాకు అక్కడే ఉండిపోతా అని చెప్పిన వ్యక్తి.. తిరిగి కాల్ చేశాడు. రిటర్న్ జర్నీలో చాలా ప్రాంతాలకు తిప్పాడు. మొత్తం తిరగడానికే రూ.5వేల వరకూ ఇందనం అయిపోయింది’ అని డ్రైవర్ చెప్తున్నాడు.
చినమారా పోలీస్ స్టేషన్ అధికారులు మాట్లాడుతూ.. ‘అందిన సమాచారం ప్రకారం.. అతను పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫొటోలు దిగాడు. పోలీసులతో తనకు సంబంధాలున్నాయని నమ్మించి షాపుల వారిని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించాడు. అంతేకాకుండా లాక్ డౌన్ ప్రొటోకాల్స్ బ్రేక్ చేసి డబ్బులు లాక్కుందామని ప్రయత్నించాడు. అని చెప్తున్నారు.
వేరే వ్యక్తిలా నటించడం దత్తాకు మొదటిసారి కాదు. గతంలో ఓ సారి లాయర్ లా, జిల్లా శిశు సంరక్షణ సర్వీస్ సభ్యుడిగానూ నటించాడు. ఫస్ట్ లాక్ డౌన్ సమయంలో డాక్టర్ అవతారం కూడా ఎత్తాడు.