Assam Student: టెర్రర్ గ్రూప్ ఉల్ఫాకు సపోర్ట్ చేసిన స్టూడెంట్
అస్సాంకు చెందిన మరో విద్యార్థి సోషల్ మీడియాలో పోస్టు చేసి అరెస్ట్ అయ్యాడు. పరేశ్ అసోం అలియాస్ పరేశ్ బరువా నేతృత్వంలోని టెర్రర్ గ్రూప్ ఉల్ఫా (ఐ)కు సపోర్ట్ తెలియేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఉదల్గురి జిల్లా పోలీసులు టంగ్లా కాలేజిలో చదువుతున్న ప్రమోద్ కలిత (22)ను అరెస్ట్ చేశారు.

Pune Man Arrest
Assam Student: అస్సాంకు చెందిన మరో విద్యార్థి సోషల్ మీడియాలో పోస్టు చేసి అరెస్ట్ అయ్యాడు. పరేశ్ అసోం అలియాస్ పరేశ్ బరువా నేతృత్వంలోని టెర్రర్ గ్రూప్ ఉల్ఫా (ఐ)కు సపోర్ట్ తెలియేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఉదల్గురి జిల్లా పోలీసులు టంగ్లా కాలేజిలో చదువుతున్న ప్రమోద్ కలిత (22)ను అరెస్ట్ చేశారు.
అస్సామీ, ఇంగ్లీష్ భాషలో ఉన్న అతని పోస్టులో తన జీవితం ఉల్ఫా (ఐ)కి, గ్రూప్ లీడర్ పరేశ్ బరువాకు అంకితం ఇస్తానని రాసుకొచ్చాడు. “I always support ULFA” అని రాయడంతో పాటు దమ్ముంటే పోలీసులను అరెస్ట్ చేయమంటూ డిమాండ్ చేశాడు. అతను ఉల్ఫాలో సభ్యుడు కాకపోయినా తనకు ఆ గ్రూప్ అంటే చాలా ఇష్టమని రాసుకొచ్చాడు.
కలైగావోన్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసి కలితాను అరెస్ట్ చేశామని, పలు సెక్షన్ల ప్రకారం కేసు ఫైల్ అయిందని పేర్కొన్నారు. అస్సాంలో రెండు నెలల వ్యవధిలోనే ఇలాంటి అరెస్ట్ రెండోది.
మే18న గోలాఘాట్ ప్రాంతంలోని పోలీసులు బర్షశ్రీ బురగోహైన్ ను అరెస్ట్ చేశారు. జోరాట్ డీసీబీ కాలేజిలో సెకండ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. రెండు నెలలుగా అతను జైల్లోనే ఉన్నాడు. గత వారం అప్లికేషన్ పెట్టుకోవడంతో జిల్లా కోర్టు జైల్లో నుంచే పరీక్షలు రాసుకునేందుకు అనుమతించింది.