ACB Major Action: ఉద్యోగంలో చేరిన మొదటి రోజే లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన అసిస్టెంట్ రిజిస్ట్రార్

దరఖాస్తు నేపథ్యంలో, ఏసీబీ బృందం మొత్తం విషయాన్ని ధృవీకరించింది. శుక్రవారం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ మితాలీ శర్మను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేసింది

Chhattisgarh: ఛత్తీస్‭గఢ్ రాష్ట్రంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‭గా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే లంచం తీసుకుంటూ రెండ్ హ్యాండెడ్‌గా పడ్డుబడ్డారు ఒక మహిళా అధికారి. అధికారి పేరు మితాలీ శర్. 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ తన చాంబర్‭లోనే దొరికిపోయారు. గర్హై గ్రామానికి చెందిన రామేశ్వర్ ప్రసాద్ యాదవ్, తండ్రి దివంగత మంగన్ యాదవ్ అనే వ్యక్తి నుంచి దరఖాస్తు కోసం ఆమె లంచం డిమాండ్ చేశారు.

United Progressive Alliance: యూపీఏ పేరు మారబోతోందా? బెంగళూరు విపక్షాల మీటింగు నేపథ్యంలో ఆసక్తికర విషయం

కోడెర్మ వ్యాపార్ మండల సహయోగ్ సమితిని అసిస్టెంట్ రిజిస్ట్రార్ తనిఖీ చేసిన అనంతరం వివరణ కోరారు. అనంతరం ఈ విషయం బయటికి రాకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశారు మితాలీ శర్మ. కాగా, రామేశ్వరప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఏసీబీ చర్యలు చేపట్టింది. అనంతరం మిథాలీ శర్మను రాజా తలాబ్‌లోని తన అధికారిక నివాసంలోనే 10 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేసింది.

Singapore Politics: సింగపూర్ పార్లమెంట్ స్పీకర్, మంత్రి రాజీనామా.. ఇద్దరి మధ్య అనుచిత సంబంధమే కారణం

అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ మితాలీ శర్ను కలవడానికి రామేశ్వర్ ప్రసాద్ కార్యాలయానికి చేరుకున్నప్పుడు, కొన్ని లోటుపాట్లు బయటకు రాకుండా ఉండటానికి మితాలీ శర్మ 20,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఈ విషయమై ఏసీబీకి రాజేంద్రప్రసాద్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దరఖాస్తు నేపథ్యంలో, ఏసీబీ బృందం మొత్తం విషయాన్ని ధృవీకరించింది. శుక్రవారం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ మితాలీ శర్మను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేసింది. అనంతరం ఆమెను హజారీబాగ్‌కు తీసుకెళ్లినట్లే ఏసీబీ అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు