Attack on BJP President: పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిపై దాడి
పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.. మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తైంది. నాలుగోదశ పోలింగ్ ఏప్రిల్ 10 తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. సభలు, సమావేశాలతో బెంగాల్ లో హోరెత్తిస్తున్నారు.

west bangal bjp leader
Attack on BJP President: పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.. మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తైంది. నాలుగోదశ పోలింగ్ ఏప్రిల్ 10 తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. సభలు, సమావేశాలతో బెంగాల్ లో హోరెత్తిస్తున్నారు.
ఇక బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, రోడ్ షోలతో బిజీ అయ్యారు. నాలుగో దశలో కూచ్ బెహర్ ప్రాంతంలోని నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా దిలీప్ ఘోష్ కూచ్ బెహర్ లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో వస్తుండగా కొందరు వ్యక్తులు నాటు బాంబులు, ఇటుకలతో ఆయన వాహనంపై దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దం పగిలిపోయింది. ఓ ఇటుక వచ్చి దిలీప్ ఘోష్ గూడకు తగిలింది.
దీంతో ఆయనకు బలమైన గాయం అయింది. ఇక ఈ ఘటనపై ఆయన స్పందించారు. టీఎంసీ కార్యకర్తలే తనపై దాడి చేశారని ఆరోపించారు. ర్యాలీ ముగించుకొని వస్తున్న సమయంలో మాటువేసి ఈ దాడి చేసినట్లు ఆయన వివరించారు. సమీపంలో జరిగిన మమతా బెనర్జీ ర్యాలీకి హాజరై వస్తున్న టీఎంసీ కార్యకర్తలు తమ వాహనాలపై దాడికి దిగారని తెలిపారు. టీఎంసీ జండాలు పట్టుకొని కర్రలు, బాంబులు, ఇటుకలతో దాడి చేశారని తెలిపారు. దాడి తర్వాత ఓ వీడియో పోస్ట్ చేశారు. తనకు గాయమైన ఫోటో కూడా షేర్ చేశారు దిలీప్. దీనిపై ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ స్పందించలేదని ఆయన వివరించారు.
కాగా కూచ్ బెహర్ ప్రాంతంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో మొదటి దశలో 30 రెండవ దశలో 30 మూడవ దశలో 31 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఇక నాలుగో దశలో 44 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగోదశ ఎన్నికలతో సగం నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తవుతుంది. ఇక రాష్ట్రంలో ఏప్రిల్ 29తో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మే 2న ఫలితాలు విడుదల చేస్తారు. మే 2 న తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంతో పాటు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల ఫలితాలు కూడా విడుదల అవుతాయి.