Atul Subhash case: అతుల్ సుభాశ్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఆ ముగ్గురు అరెస్ట్

బెంగళూరు ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాశ్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు..

Atul Subhash case: అతుల్ సుభాశ్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఆ ముగ్గురు అరెస్ట్

Atul Subhash Wife Arrested

Updated On : December 15, 2024 / 11:27 AM IST

Atul Subhash case: బెంగళూరు ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాశ్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సుభాశ్ ఆత్మహత్య చేసుకునే ముందు దాదాపు 80 నిమిషాల వీడియోను చిత్రీకరించాడు. దీనికితోడు ఏకంగా 24పేజీల లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యతో తాను అనుభవిస్తున్న మానసిక క్షోభను వివరించాడు. నేను సంపాదించే డబ్బు నా శత్రువులను మరింత బలోపేతం చేస్తోందని, వారు దానిని వాడుకొనే నన్ను నాశనం చేస్తున్నారని వీడియోలో పేర్కొన్నాడు. ఇది ఒక విషవలయంగా మారిందని, అందుకే నేను చనిపోవాలని నిర్ణయించుకున్నానని అతుల్ పేర్కొన్నాడు. అతుల్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాజాగా కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది.

Also Read: మహిళ చనిపోతే అరెస్ట్ చేయొద్దా?: అల్లు అర్జున్ అరెస్టుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కామెంట్స్‌

అతుల్ సుభాశ్ అత్మహత్య కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భార్య నిఖితా సింఘానియాను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్ లను కూడా యూపీలోని అలహాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముగ్గురిని ప్రయాగ్ రాజ్ కోర్టులో హాజరుపర్చారు. అక్కడి నుంచి ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మామ సుశీల్ సింఘానియా పరారీలో ఉన్నట్లు తెలిసింది. అతని కోసం జాన్ పూర్ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు.

 

యూపీకి చెందిన సుభాశ్ బెంగళూరులోని ఓ ఆటోమొబైల్ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా ఉన్నాడు. 2019లో అతుల్ సుభాశ్, నిఖితకు పెళ్లి జరిగింది. 2020లో వారికి బాబు పెట్టాడు. బాబు పుట్టిన కొన్నాళ్లకు భార్యాభర్తల మధ్య ఘర్షణలు తలెత్తడంతో 2021లో నిఖిత బాబును తీసుకొని తన పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత నిఖిత తన భర్తపై పలు కేసులు పెట్టింది. ఈ క్రమంలో హత్య, వరకట్న వేధింపులు, అసహజ శృగారం మొదలైన అనేక ఆరోపణలతో అతుల్ సుభాశ్ పై మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి. సుభాశ్ తల్లిదండ్రులపైనా పలు కేసులు నమోదయ్యాయి. ఈనెల 9న బెంగళూరులోని తన ప్లాట్ లో అతుల్ సుభాశ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు భార్య నిఖితా సింఘానియా, అత్త నిషా, బావ అనురాగ్, మామ సుశీల్ తో పాటు జడ్జి రీటా కౌశిక్ లు కారణమని వీడియోలో, తాను రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఫ్యామిలీ కోర్టు జడ్జి రీటా కౌశిక్ తన భార్య మాట మాత్రమే విన్నాడని అతుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. హైకోర్టు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకుండా తనను బెంగళూరు నుంచి యూపీకి ఒకటి తరువాత మరొక కేసు పెట్టి తిప్పించారని, తనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునేందుకు రూ.3 కోట్లు, తన కుమారుడిని చూసేందుకు హక్కుల కోసం రూ.30లక్షలు డిమాండ్ చేసినట్లు అతుల్ సుభాశ్ ఆత్మహత్యకు ముందు తాను చిత్రీకరించిన వీడియోలో పేర్కొన్నాడు.