Anand Mahindra : మీరు ఇలా తయారు చేయగలరా? నేను పెట్టుబడి పెడతా..! ఆనంద్ మహీంద్ర ట్వీట్.. వీడియో వైరల్

ఓ నదిలో చెత్తను తొలగిస్తున్న ఆటోమేటిక్ రోబోటిక్ యంత్రం వీడియోను ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

Autonomous Robot For Cleaning Rivers : దేశంలో కాలుష్యం పెరిగిపోతోంది. నదులు కలుషితం అవుతున్నాయి. ముఖ్యంగా నదుల్లో, చెరువుల్లో చెత్తచెదారం పేరుకుపోయి నీరు అపరిశుభ్రంగా మారుతుంది. చెత్తను తొలగించేలా ప్రత్యేక పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో ఓ నదిలో రోబోటిక్ యంత్రం తనకుతానుగా చెత్తను లాక్కొని తనలో వేసుకుంటుంది. తద్వారా నది పరిశుభ్రంగా మారుతుంది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేశారు.

Also Read : పూనమ్ పాండే మరణించిందా.. వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..

ఈ వీడియోలో కనిపిస్తున్న ఆటోమాటిక్ రోబో యంత్రం నదిలో చెత్తను భలే క్లీన్ చేస్తుంది. ఇది చైనాలో తయారైనట్లుంది.. ఇలాంటి రాబోల అవసరం మన దేశానికి ఎంతగానో ఉందని ఆనంద్ మహీంద్ర అన్నారు. ఈ తరహా రాబోలను మనంకూడా ఇప్పటికప్పుడే తయారు చేసుకోవాలని నేను భావిస్తున్నాను.. ఇప్పటికే ఇలాంటి రాబోలను తయారు చేస్తున్న, తయారు చేసేందుకు కృషి చేస్తున్నస్టార్టప్ లకు నేను అండగా ఉంటా.. పెట్టుబడి పెడతా అంటూ ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చారు. పూర్తి వివరాలతో నన్ను సంప్రదిస్తే ఆవసరమైన పెట్టుబడి అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు.

Also Read :  భ‌యం పోయింది! క‌రోనా వ‌చ్చినా క్రికెట్ ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయ‌ర్‌

ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆసక్తికర వీడియోలను షేర్ చేస్తూ అందరిని ఆశ్చపరుస్తుంటారు. అంతేకాక.. పలు రంగాల్లో ప్రతిభాపాఠవాలు కలిగిన వారిని ప్రోత్సహిస్తూ వారికి అండగా ఉంటానని హామీ ఇస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ (ఎక్స్)లో ఫాలోవర్ల సంఖ్య 11 మిలియన్లు దాటింది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు