అయోధ్యలో శుభశకునం : రామజన్మభూమి స్థలంలో బైటపడ్డ దేవతా విగ్రహాలు

  • Published By: nagamani ,Published On : May 21, 2020 / 09:45 AM IST
అయోధ్యలో శుభశకునం : రామజన్మభూమి స్థలంలో బైటపడ్డ దేవతా విగ్రహాలు

Updated On : May 21, 2020 / 9:45 AM IST

శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో శుభ శకునం జరిగింది.  రామజన్మభూమి స్థలంలో గత 10 రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్థలం చదును చేస్తుండగా కొన్ని దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. అలా బైటపడినవాటిలో ఐదడుగుల శివలింగం, పుష్ప కలశం, మరికొన్ని విరిగిన దేవతా విగ్రహాలు, ఏడు నల్లరాతి స్థంభాలు, ఆరు ఎర్రరాతి స్థంభాలు లభ్యమయ్యాయి. 

దీనికి సంబంధించి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడారు. మే 11 నుంచి కార్మికులు రామజన్మభూమి స్థలంలో 10మంది కార్మికులతో స్థలంలో పనులు జరుగుతున్నాయని తెలిపారు.

కాగా..దశాబ్దాలుగా వివాదంగా కొనసాగిన అయోధ్య రామజన్మభూమి స్థలం విషయంలో దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పుఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయోధ్య స్థలంలో మే 11 నుంచి శ్రీరామ్ తీర్థ క్షేత్ర ట్రస్ట్ పనులు చేపట్టింది. 

Read: భారత సైన్యాన్ని రెచ్చగొడుతున్న చైనా..సరిహద్దుల్లో యుద్దాలు