దానకర్ణుల జాబితా : టాప్ లో అజీమ్ ప్రేమ్ జీ…మూడో స్థానంలో ముఖేష్ అంబానీ

  • Published By: nagamani ,Published On : November 10, 2020 / 04:38 PM IST
దానకర్ణుల జాబితా  : టాప్ లో అజీమ్ ప్రేమ్ జీ…మూడో స్థానంలో ముఖేష్ అంబానీ

Updated On : November 10, 2020 / 4:58 PM IST

Azim Premji tops EdelGive Hurun India Philanthropy List : డబ్బులు చాలామంది సంపాదిస్తారు. కానీ దానాలు మాత్రం కొందరే చేస్తారు. కొంతమంది తాము చేసే దానాలు గొప్పగా ప్రకటించుకుంటారు. మరికొందరు మనస్ఫూర్తిగా చేసే దానాల గురించి అస్సలు చెప్పుకోరు. మేం ఇంత చేశాం..అంత చేశామని ప్రకటించుకోరు. అటువంటి మహోన్నత వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వారిలో మొదటి వ్యక్తి విప్రో అధినేత ‘అజీమ్ ప్రేమ్ జీ’.


తమ సంపాదనలో ఎన్నో విరాళాలు ఇచ్చి సేవలు చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. మంచి పనులను తమ సహాయ సహకారాలను అందజేస్తుంటారు. వీరిలో హెచ్ సీఎల్ అధినేత శివ్ నాడార్,ముఖేష్ అంబానీ,కుమార మంగళం బిర్లా, వేదాంత గ్రూపు అనిల్ అగర్వాల్ ఉన్నారు. అలాగే రోహిణి నీలేకని, బిన్నీ బన్సాల్ వంటి మహోన్నతులు తమ దానగుణాలను చాటుకున్నారని ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా విడుదల చేసిన జాబితాలో వెల్లడించింది.



https://10tv.in/china-halts-jack-mas-37-bn-ant-group-ipo-citing-major-issues/
సంపాదించే ఆస్తిపాస్తులో సమాజ హితం కోరి విరాళాలు ఇవ్వటంలో అజీమ్ అందనంత ఎత్తులో ఉన్నారనీ ప్రేమ్ జీ గణాంకాలే చెబుతున్నాయి. 75 ఏళ్ల అజీమ్ ప్రేమ్ జీ విరాళాలు ఇవ్వటంలో మేటి అని ఆయన ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారని ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.


అత్యధిక విరాళాలు అందించినవారిలో అజీమ్ ప్రేమ్ జీ అగ్రస్థానంలో ఉన్నారనీ..ఆయన 2020లో రూ.7,904 కోట్లను చారిటీలకు విరాళంగా ఇచ్చారని ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా విడుదల చేసిన జాబితా వెల్లడించింది.


దాతృత్వానికి మరోపేరులా నిలిచే ప్రేమ్ జీ విప్రోలో తన 34 శాతం వాటాలను సమాజ సేవ కోసం అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ కు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వాటాల విలువ రూ.52,750 కోట్లు. ఎడెల్ గైవ్ హురూన్ ఇండియా విడుదల దాతల లిస్టు ఎవరెవరు ఉన్నారో చూద్దాం..


1st plase Ajim premji

 టాప్ లో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ..

రెండోస్థానంలో హెచ్ సీఎల్ అధినేత శివ్ నాడార్

మూడో స్థానంలో రిలయన్స్ కింగ్ ముఖేశ్ అంబానీ

 

నాలుగో స్థానంలో బిర్లా దిగ్గజం కుమార మంగళం బిర్లా

 ఐదో స్థానంలో వేదాంత గ్రూపు అనిల్ అగర్వాల్

కాగా.. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య కాలంలో ఇచ్చిన విరాళాల ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. ఈ ఏడాది 112 మందికి ఈ జాబితాలో స్థానం కల్పించారు. అత్యధిక విరాళాలు ఇచ్చిన మహిళగా రోహిణి నీలేకని, పిన్నవయసు దాతృత్వకర్తగా బిన్నీ బన్సాల్ (40 ఏళ్ల లోపు వయసు) ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు.