జైట్లీ అంత్యక్రియల్లో ఫోన్ల దొంగతనం..బీజేపీ ఎంపీది కూడా

  • Published By: venkaiahnaidu ,Published On : August 26, 2019 / 08:10 AM IST
జైట్లీ అంత్యక్రియల్లో ఫోన్ల దొంగతనం..బీజేపీ ఎంపీది కూడా

Updated On : August 26, 2019 / 8:10 AM IST

ఆదివారం ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగిన విషయం తెలిసిందే. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు,కార్యకర్తలు,వివిధ పార్టీల ప్రముఖులు హాజరయ్యి జైట్లీకి కడసారి వీడ్కోలు పలికారు. అయితే ఆ సమయంలో అనేకమంది తమ ఫోన్లు పోగొట్టుకున్నారు.

ఆదివారం నిగమ్ బోధ్ ఘాట్ లో 11మంది ప్రముఖులు తమ ఫోన్లు పోగొట్టుకున్నారు. పతంజలి ప్రతినిధి ఎస్ కే తజరవాలా, బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో తదితరులు తమ ఫోన్ దొంగలించబడినట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆ రోజు మొత్తం ఏయే ప్లేస్ లలో ఉందో గూగుల్ మ్యాప్  ట్రాకింగ్ ద్వారా గుర్తించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వనున్నట్లు తెలిపారు