Twin Heads: రెండు తలలు, మూడు చేతులతో శిశువు జననం, తల్లీబిడ్డా క్షేమం
అప్పుడే పుట్టిన శిశువుకు రెండు తలలు, మూడు చేతులు ఉండటంతో వైద్యులతో సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. మధ్యప్రదేశ్ లోని మహారాజా యశ్వంత్ రావ్ హాస్పిటల్ లో మంగళవారం ఈ ఘటన నమోదైంది.

Twin Heads
Twins Born: అప్పుడే పుట్టిన శిశువుకు రెండు తలలు, మూడు చేతులు ఉండటంతో వైద్యులతో సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. మధ్యప్రదేశ్ లోని మహారాజా యశ్వంత్ రావ్ హాస్పిటల్ లో మంగళవారం ఈ ఘటన నమోదైంది. డెలివరీకి రట్లామ్ హాస్పిటల్ కు రిఫర్ చేయడంతో ముందస్తు చికిత్స కోసం NICUవార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
పీడియాట్రిక్ సర్జన్ డా. బ్రిజేశ్ లహోటీ మాట్లాడుతూ.. ఈ కండిషన్ ను డైసెఫెలాక్ పారాపగస్ గా వివరించారు. ఈ కారణంతో కాళ్లు, లేదా చేతులు అదనంగా ఉండి పుడతారని తెలిపారు.
‘ఇలాంటి కేసులు అరుదుగా ఉంటాయి. శిశువు పెరిగే తొలి రోజుల నుంచి వీరిపై అబ్జర్వేషన్ ఉంచాలని.. ఇప్పటివరకూ శిశువుపై ఎటువంటి సర్జరీ ప్లాన్ చేయాలేదని’ డా. లహోటీ అంటున్నారు.
Read Also:15 నిముషాల తేడాతో ఏడాది దాటేసిన కవలలు
పాపకు రెండు తలలు, ఒక మొండెం, మూడు చేతులు ఉన్నాయని చెప్పారు. రెండు చేతులు మామూలు స్థానంలోనే ఉండగా.. ఒకటి మాత్రం తలకు దగ్గరగా ఉందని తెలిపారు. ఆ శిశువుకు రెండు గుండెలు ఉన్నట్లు తెలిసింది.
జావోరాలోని నీమ్ చౌక్ లో ఉండే మహిళ రట్లామ్ లోని జిల్లా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అల్ట్రా సౌండ్ లో తమకు కవలలు అని తెలిసింది.. ఈ పరిస్థితిలో ఉంటారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.