Saina Nehwal : ఉజ్జయిని మహాకాలేశ్వర్ దేవాలయంలో సైనా నెహ్వాల్ పూజలు
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ శనివారం ఉదయం ఉజ్జయిని మహాకాలేశ్వర్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తన తల్లిదండ్రులతో కలిసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని దేవాలయానికి వచ్చారు. బాబా మహాకాల్ దేవాలయంలో హారతి కార్యక్రమంలో సైనా నెహ్వాల్ పాల్గొన్నారు....

Badminton star Saina Nehwal
Badminton star Saina Nehwal : బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ శనివారం ఉదయం ఉజ్జయిని మహాకాలేశ్వర్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తన తల్లిదండ్రులతో కలిసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని దేవాలయానికి వచ్చారు. బాబా మహాకాల్ దేవాలయంలో హారతి కార్యక్రమంలో సైనా నెహ్వాల్ పాల్గొన్నారు. (Badminton star Saina Nehwal) ఆలయపూజారి సంజయ్ గురు పూజలు చేశారు.
Morocco : మొరాకోలో భారీభూకంపం…296 మంది మృతి
మహాకాల్ దేవాలయ కమిటీ ప్రతినిధులు సైనాకు బాబా మహాకాల్ ఫొటో, ప్రసాదాన్ని అందజేశారు. (Mahakaleshwar temple in Ujjain) తన బాల్యం నుంచి తాను నమ్మే దేవుడు మహాకాలేశ్వర్ అని, ఈ దేవాలయాన్ని సందర్శించినపుడల్లా తాను ఎంతో సంతోషపడతానని సైనా చెప్పారు. బాబా మహాకాల్ ను సందర్శించడం తనకు, తన కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.
G20 Summit 2023 : మోదీ, జోబిడెన్ ద్వైపాక్షిక సమావేశంలో ఏఐ, సైన్స్, డిఫెన్స్ అంశాలపై చర్చ
తాను మోకాలి నొప్పితో బాధపడుతున్నానని, ఫిజియోథెరపిస్ట్, డాక్టరు సలహాపై తాను తిరిగి త్వరలో క్రీడల్లో పాల్గొంటానని చెప్పారు. తాను ప్రస్థుతం సంతోషంగా ఉంటూ ఆడుతున్నానని, భవిష్యత్ రాజకీయాల్లోకి వస్తానో లేదో తెలియదని సైనా తెలిపారు. శనివారం తెల్లవారుజామున బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్, ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ లు కూడా ఉజ్జయిని దేవాలయాన్ని సందర్శించి భస్మా హారతి పూజలు చేశారు.