తిక్కలోడా.. మంచోడా : ప్రచారానికి రూ.75 లక్షలు ఇస్తారా, కిడ్నీ అమ్ముకోమంటారా

భోపాల్ : హెడ్డింగ్ చూసి షాక్ అయ్యారా.. ఇది నిజమే.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన దగ్గర డబ్బుల్లేవని, ప్రచారం కోసం రూ. 75 లక్షలు ఇవ్వండి..

  • Published By: veegamteam ,Published On : April 16, 2019 / 12:20 PM IST
తిక్కలోడా.. మంచోడా : ప్రచారానికి రూ.75 లక్షలు ఇస్తారా, కిడ్నీ అమ్ముకోమంటారా

Updated On : April 16, 2019 / 12:20 PM IST

భోపాల్ : హెడ్డింగ్ చూసి షాక్ అయ్యారా.. ఇది నిజమే.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన దగ్గర డబ్బుల్లేవని, ప్రచారం కోసం రూ. 75 లక్షలు ఇవ్వండి..

భోపాల్ : హెడ్డింగ్ చూసి షాక్ అయ్యారా.. ఇది నిజమే.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన దగ్గర డబ్బుల్లేవని, ప్రచారం కోసం రూ. 75 లక్షలు ఇవ్వండి.. లేదంటే కిడ్నీ అమ్ముకుంటాను.. అందుకు అనుమతి ఇవ్వండి అని ఎన్నికల కమిషన్‌కు ఓ నాయకుడు లేఖ రాసిన విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈసీకి లేఖ రాసిన ఆ ఘనుడి పేరు కిశోర్ సమ్రితే. సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం బాలాఘాట్ లోక్‌సభ  నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్

జిల్లా ఎన్నికల అధికారి దీపక్ ఆర్యకు.. కిశోర్ లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం ఒక అభ్యర్థి రూ. 75 లక్షలకు మించి ఖర్చు చేయరాదని ఎన్నికల కమిషన్ నిబంధన పెట్టిందని, అంత డబ్బు తన దగ్గర  లేదని అన్నారు. రూ. 75 లక్షలైనా ఇవ్వండి, లేదా ఏదైనా బ్యాంకు నుంచి రుణం ఇప్పించండి.. అది కుదరని పక్షంలో తన కిడ్నీని అమ్ముకునేందుకు అనుమతివ్వండి అని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నా  అంటూ లేఖలో తెలిపారు. తాను పోటీ చేస్తున్న బాలాఘాట్ నియోజకవర్గంలో తన అభ్యర్థులంతా ధనవంతులే అని కిశోర్ చెప్పారు. వాళ్లు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బు వెదజల్లుతున్నారని తెలిపారు.

తన దగ్గరేమో రూపాయి కూడా లేదని వాపోయారు. దీంతో ఎన్నికల ప్రచారం ఎలా చేయాలో తెలియక ఇదిగో ఇలా ఈసీకి లేఖ రాశాను అని చెప్పుకొచ్చారు. బాలాఘాట్ లో పోటీ చేస్తున్న వారంతా అవినీతిపరులే అని ఆరోపించిన కిశోర్.. వారిపైనే తన పోరాటం అని స్పష్టం చేశారు. బాలాఘాట్ అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని, పేదరికాన్ని తొలగించేందుకు కృషి చేస్తానని కిశోర్ వెల్లడించారు. కిషోర్ లేఖ వైరల్ గా మారింది. ఆయన విన్నపం తెలుసుకుని ఎన్నికల అధికారులు విస్తుపోయారు. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాక తల పట్టుకున్నారు. ఇంతకీ కిశోర్ తిక్కలోడా, మంచోడా అని డిస్కస్ చేసుకుంటున్నారు.
Read Also : మరో నలుగురు ప్లేయర్లను ప్రకటించిన బీసీసీఐ