బాలాకోట్ లో IAF దాడిలో 170 మంది హతం

బాలాకోట్ లోని జైషే ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) చేసిన దాడిలో ఒక్కరు కూడా చనిపోలేదని,కొన్ని చెట్లు మాత్రమే దెబ్బతిన్నాయంటూ ఇన్ని రోజులు బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి-26,2019న బాలాకోట్ లోని ఉగ్రశిబిరాలపై ఐఏఎఫ్ యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయని, ట్రీట్మెంట్ సమయంలో మరణించిన వారితో కలిపి 130-170 మధ్యలో జైషే ఉగ్రవాదులు చనిపోయారని ఇటాలియన్ జర్నలిస్ట్ ఫ్రాన్సెక్సా మారినో తెలిపారు.చనిపోయినవారిలో 11మంది ట్రైనర్లు(శిక్షకులు)కూడా ఉన్నట్లు మారినో తెలిపారు.
భారత యుద్ధ విమానాలు దాడి చేసి వెళ్లిన రెండున్నర గంటల తర్వాత ఉదయం 6గంటల సమయంలో బాలాకోట్ కి 20కిలోమీటర్ల దూరంలోని షింకియారి నుంచి పాక్ ఆర్మీ స్పాట్ కు చేరుకుందని మారిన్ తెలిపారు. క్షతగాత్రులను షింకియారి ప్రాంతంలో ఉన్న హర్కతుల్ ముజాహిదీన్ క్యాంప్ కు పాక్ ఆర్మీ తరలించిందని మారినో తెలిపారు.పాక్ ఆర్మీ డాక్టర్లు వారికి ట్రీట్మెంట్ చేసినట్లు తెలిపారు.స్థానికుల సమాచారం ప్రకారం ఆ క్యాంప్ లో ఇప్పటికీ 45 మంది ఉగ్రవాదులు ట్రీట్మెంట్ పొందుతుండగా,తీవ్రమైన గాయాల కారణంగా ట్రీట్మెంట్ సమయంలో 20మంది చనిపోయారని మారినో తెలిపారు.కోలుకున్నవారు ఇప్పటికీ పాక్ ఆర్మీ కస్టడీలోనే ఉన్నారని ఆమె తెలిపారు.
ఈ మొత్తం విషయం బయటకు పొక్కకుండా జైషే నేతలు మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించారని, ఇప్పుడు జైషే క్యాంపును తాలిమున్ ఖురాన్(మదర్సా)గా మార్చేశారని, నలుగురు టీచర్లు,కొంతమంది చిన్నారులకు తప్ప ప్రస్తుతం స్థానిక పోలీసులకు కూడా ఇక్కడ అనుమతి లేదుని ఆమె చెప్పారు.జైషే క్యాంప్ ఆనవాళ్లు లేకుండా చేసేశారని ఆమె తెలిపారు.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మారినో రాసిన కథనాన్ని ఆన్ లైన్ మ్యాగజైన్ స్ట్రింగర్ ఆసియా పబ్లిష్ చేసింది.