130 మిలియన్ల మంది ప్రజల నమ్మకమే నా ఫ్రూప్ : మోడీ
బాలాకోట్ వైమానక దాడులపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోడీ ధీటుగా బదులిచ్చారు. 130 మిలియన్ల మంది ప్రజల విశ్వాసమే తనకు ఫ్రూప్ అని మోడీ స్పష్టం చేశారు.

బాలాకోట్ వైమానక దాడులపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోడీ ధీటుగా బదులిచ్చారు. 130 మిలియన్ల మంది ప్రజల విశ్వాసమే తనకు ఫ్రూప్ అని మోడీ స్పష్టం చేశారు.
బాలాకోట్ వైమానక దాడులపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోడీ ధీటుగా బదులిచ్చారు. 130 మిలియన్ల మంది ప్రజల విశ్వాసమే తనకు ఫ్రూప్ అని మోడీ స్పష్టం చేశారు. శుక్రవారం ఘాజియాబాద్ లో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో పీఎం మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మాదిరిగా పనిచేసి ఉంటే ప్రజలు తనను ఎందుకు మళ్లీ ఎన్నుకుంటారని ప్రశ్నించారు.
Also See: సీఎం కేసీఆర్ పై శివాజీ సంచలన ఆరోపణలు
తన హయాంలో ఎన్నో నిర్ణయాలు తీసుకోనున్నానని, అదే ప్రజలు ఈ రోజు వరకు తన నిర్ణయాలను ప్రశ్నించలేదని విపక్షాలపై మోడీ ధ్వజమెత్తారు. ‘విపక్ష నేతల్లారా తప్పక వినండి.. 130 మిలియన్ల మంది ప్రజల నమ్మకమే నాకు పెద్ద ఫ్రూప్. అవినీతికి పాల్పడిన వారు జైలుకెళ్లాల్సి వస్తుందనే భయంతోనే ఢిల్లీని హస్తగతం చేసుకోని మోడీని ఇక్కడి నుంచి పంపించివేయాలని కుట్ర చేస్తున్నారు’ అని విమర్శించారు.
2016లో సర్జకల్ స్ట్రయిక్ సమయంలో కూడా ఇదే విపక్షాలు తనను ప్రశ్నించాయని, ఇప్పుడు కూడా అదే జరగుతోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఎంతో అభివృద్ధి జరిగిందని, సమాజంలోని బలహీన రంగాలను ఆర్థికంగా మెరుగుపడే దిశగా కృషి చేస్తున్నట్టు మోడీ తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజల జీవన విధానం మెరుగుపడిందని, ఇదే పరిస్థితి భవిష్యుత్ లోనూ కొనసాగడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు.
ఘాజియాబాద్ పర్యటనలో భాగంగా పీఎం మోడీ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆగ్రా, లక్నో, ఘాజియాబాద్ లోని మెట్రో ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. శనివారం (మార్చి 9, 2019) నోయిడా మెట్రో కొత్త రూట్ ను మోడీ ప్రారంభించనున్నారు.
Also See: 16 ఎంపీ సీట్లు గెలుద్దాం : ఢిల్లీని శాసిద్దాం