Bengaluru : చదువుకి వయసుకి సంబంధం లేదని నిరూపించిన ఆటోడ్రైవర్.. 38 ఏళ్ల క్రితం చదువు మానేసి..

కొందరిలో ప్రతిభ ఉన్నా బాధ్యతల కారణంగా చదువులకి దూరమైన వారు ఉన్నారు. గ్యాప్ తీసుకున్నా చదువుపై ఉన్న మక్కువతో వయసుతో సంబంధం లేకుండా చదువుకున్నవారు ఉన్నారు. తాజాగా బెంగళూరుకి చెందిన ఆటోడ్రైవర్ భాస్కర్ స్టోరీ వైరల్ అవుతోంది.

Bengaluru : చదువుకి వయసుకి సంబంధం లేదని నిరూపించిన ఆటోడ్రైవర్.. 38 ఏళ్ల క్రితం చదువు మానేసి..

Bengaluru

Updated On : August 29, 2023 / 1:30 PM IST

Bengaluru : బెంగళూరు సిటీ నుంచి ఆసక్తికరమైన. స్ఫూర్తివంతమైన కథనాలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఓవైపు ఆటో నడుపుతూనే మరోవైపు చదువు కొనసాగిస్తున్న ఆటోడ్రైవర్ స్టోరి బయటకు వచ్చింది. ఈ కథనం వైరల్ అవుతోంది.

Bengaluru : సాప్ట్‌వేర్ ఉద్యోగి కాదు.. ఆటో డ్రైవర్! స్మార్ట్ వాచ్‌లో క్యూఆర్ కోడ్.. ఆశ్చర్య‌పోతున్న నెటీజన్లు

చదువు వయసుకి అడ్డంకి కాదు.. బాధ్యతల కారణంగా చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టి మళ్లీ ఉన్నత చదువులు చదువుకున్న ఎంతోమంది స్ఫూర్తివంతమైన కథలు చదివాం. తాజాగా నిధి అగర్వాల్ అనే ట్విట్టర్ యూజర్ (@Ngarwalnidhi) షేర్ చేసిన ఇంట్రెస్టింగ్ స్టోరీ వైరల్ అవుతోంది. బెంగుళూరికి చెందిన భాస్కర్ అనే ఆటో డ్రైవర్ 1985 లో పదవ తరగతి పాసయ్యాడు. ఆ తరువాత కుటుంబ బాధ్యతలు మీద పడటంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాడు. చాలా గ్యాప్ తర్వాత తిరిగి ఈ సంవత్సరం చదువుకోవడం మొదలుపెట్టాడు. అతని ఆటో ఎక్కిన నిధి అగర్వాల్‌కి మాటల్లో ఈ విషయం తెలిసింది. భాస్కర్ ఈ సంవత్సరం PUC పరీక్షలు రాస్తున్నాడు. తాజాగా ఇంగ్లీష్ పరీక్ష రాసాడట. అతనికి ఇద్దరు పిల్లలు. వారు 3,6 తరగతులు చదువుతున్నారు. బాధ్యతల కారణంగా చదువు మానేసినా.. చదువుపై ఉన్న మక్కువతో భాస్కర్ తిరిగి చదువుకోవడం ఎంతో స్ఫూర్తి కలిగిస్తోందని నిధి అగర్వాల్ షేర్ చేసిన పోస్ట్ ద్వారా తెలుస్తోంది. భాస్కర్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.

Bengaluru : ఒకే సమయంలో వేర్వేరు యాప్‌లలో రైడ్స్ యాక్సెప్ట్ చేస్తున్న బెంగళూరు ఆటో డ్రైవర్లు.. అలా ఎలా?

గతంలో కూడా అనేకమంది ఆటోడ్రైవర్ల స్టోరీలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. నిధి అగర్వాల్ పోస్ట్ కూడా నెటిజన్ల మనసు దోచుకుంది. కర్నాటక ప్రభుత్వం అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణాలు ఆటో డ్రైవర్ల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దాంతో చాలామంది చదువుబాట పడుతున్నట్లు తెలుస్తోంది.